తీవ్ర రూపం దాల్చిన ‘వాయు’.. పలు రాష్ట్రాల్లో హై అలర్ట్

అరేబియా మహాసముద్రంలో ఏర్పాడిన వాయు తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా గుజరాత్, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో వాయు తీవ్రత అధికంగా ఉండనుంది. మరో రెండు రోజులు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. […]

తీవ్ర రూపం దాల్చిన ‘వాయు’.. పలు రాష్ట్రాల్లో హై అలర్ట్
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2019 | 10:47 AM

అరేబియా మహాసముద్రంలో ఏర్పాడిన వాయు తుపాను తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా గుజరాత్, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, కొంకణ్, మహారాష్ట్ర, గోవా తదితర రాష్ట్రాల్లో వాయు తీవ్రత అధికంగా ఉండనుంది. మరో రెండు రోజులు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.

కాగా వాయు తుపానును ఎదుర్కోవడానికి చేసిన ఏర్పాట్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షించారు. ప్రజలను రక్షించడానికి వీలైనన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం.. 26 బృందాలను వీరావల్ ఓడరేవు సహా గుజరాత్‌లోని తీరాల వెంట మోహరించింది. ఇదిలా ఉంటే వాయు తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ప్రస్తుతం రుతుపవన తేమ గాలులు, భూ ఉపరితలం మీద ఉన్న గాలులు మొత్తం తుఫాను దిశగగా పయనిస్తున్నాయని.. దీని వలన తెలంగాణ, ఏపీ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలలో వడగాల్పులు వీస్తున్నాయి. వాయు తుపాను తీరం దాటితే గానీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.