రఫేల్‌పై మోడీ వాదన తప్పు.. ఇది చూడండి: రాహుల్

న్యూఢిల్లీ: రఫేల్ డీల్‌పై ప్రధాని మోడీ చేస్తున్న వాదనలు తప్పని తేలినట్టు రాహుల్ చెప్పారు. ఇందుకు ఆధారంగా ‘ది హిందూ’ ప్రచురించిన కథనాన్ని ఆయన చూపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్టు పెట్టారు. మోదీ ప్రభుత్వం చేసిన ఒప్పందంపై కాగ్ రిపోర్ట్‌ నేడు రాజ్యసభ ముందుకు వచ్చింది. అందులో యూపిఏ హయాంలో జరిగిన ఒప్పందం కంటే ఎన్డిఏ హయాంలో జరిగిన రఫేల్ ఒప్పందం బెటర్‌గా ఉందని వివరణ ఉంది. అయితే ఈ రిపోర్ట్ […]

రఫేల్‌పై మోడీ వాదన తప్పు.. ఇది చూడండి: రాహుల్

న్యూఢిల్లీ: రఫేల్ డీల్‌పై ప్రధాని మోడీ చేస్తున్న వాదనలు తప్పని తేలినట్టు రాహుల్ చెప్పారు. ఇందుకు ఆధారంగా ‘ది హిందూ’ ప్రచురించిన కథనాన్ని ఆయన చూపిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్టు పెట్టారు. మోదీ ప్రభుత్వం చేసిన ఒప్పందంపై కాగ్ రిపోర్ట్‌ నేడు రాజ్యసభ ముందుకు వచ్చింది. అందులో యూపిఏ హయాంలో జరిగిన ఒప్పందం కంటే ఎన్డిఏ హయాంలో జరిగిన రఫేల్ ఒప్పందం బెటర్‌గా ఉందని వివరణ ఉంది. అయితే ఈ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ మోడీ వినిపిస్తోన్న వాదనలు సరికాదంటూ ‘ది హిందూ’ కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ కథనంలో యూపిఏ టైంలో జరిగిన ఒప్పందమే సరిగా ఉందని వివరణ ఉంది. అందులో రక్షణ శాఖకు చెందిన ఇండియన్ నెగోషియేట్ టీంలోని ముగ్గురు సభ్యుల అభిప్రాయాలు ఉన్నాయి. వారు స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు కథనంలో తెలిపారు. ఇండియన్ నెగోషియేట్ టీంలో మొత్తం ఏడుగురు సభ్యులున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు రాహుల్ రెండు ప్రధాన పాయింట్లను ఎత్తి చూపారు. ఒకటి ఖర్చు విషయం, ఇంకొకటి డెలివరీ విషయం. ఈ రెండు అంశాల్లోను మేలు జరిగిందంటూ ఎన్డిఏ చేస్తున్న వాదనను రాహుల్ తప్పు పట్టారు.

Published On - 7:02 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu