ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య

ముంబయి: రెండో భార్యతో కలిసి ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న కారణంతో ఎమ్మెల్యేను రోడ్డుపైనే చితకబాదారు ఆయన తల్లి, భార్య. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ కాగా.. ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని ఆర్ని నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ ఎనిమిదేళ్ల క్రితం అర్చనను వివాహం చేసుకున్నారు. వారిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత ప్రియా అనే మరో మహిళను వివాహం చేసుకున్న రాజు.. […]

ఎమ్మెల్యేను చితకబాదిన తల్లి, భార్య

ముంబయి: రెండో భార్యతో కలిసి ఉంటూ తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న కారణంతో ఎమ్మెల్యేను రోడ్డుపైనే చితకబాదారు ఆయన తల్లి, భార్య. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ కాగా.. ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని ఆర్ని నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజు నారాయణ ఎనిమిదేళ్ల క్రితం అర్చనను వివాహం చేసుకున్నారు. వారిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తరువాత ప్రియా అనే మరో మహిళను వివాహం చేసుకున్న రాజు.. ప్రస్తుతం ఆమెతో కలిసి ఉంటున్నారు. ఇటీవల ఓ క్రీడా కార్యక్రమ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి పయనమౌతున్న వారి వాహనాన్ని రాజు మొదటి భార్య, తల్లి అడ్డుకొన్నారు. వాహనంలో నుంచి ప్రియను లాగి ఆమెపై దాడి చేశారు. ఆ క్రమంలో అడ్డుకొన్న రాజు నారాయణను చితకబాదారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఘటన తరువాత పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఇరు వర్గాలు.. సామరస్యంగా సమస్య పరిష్కరంచుకుంటామని చెప్పడంతో కేసు నమోదు చేయలేదని పోలీస్ అధికారి డీఎస్ తెంబరే చెప్పారు.

Published On - 6:17 pm, Wed, 13 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu