AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రం తీపికబురు.. తెలంగాణకు ఆరు ఎయిర్‌పోర్టులు.!

తెలంగాణ వాసులకు కేంద్రం త్వరలోనే శుభవార్త అందించేలా కనిపిస్తోంది. రాష్ట్రానికి భవిష్యత్తులో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు రానున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రం ఆదేశాలతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ కొత్తగా ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణలో కేవలం వాణిజ్యపరంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం తప్పితే.. వేరే చోట ఎక్కడా కూడా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లేదు. బేగంపేట్‌లో ఒక విమానాశ్రయం ఉన్నా.. అది […]

కేంద్రం తీపికబురు.. తెలంగాణకు ఆరు ఎయిర్‌పోర్టులు.!
Ravi Kiran
|

Updated on: Dec 14, 2019 | 4:57 PM

Share

తెలంగాణ వాసులకు కేంద్రం త్వరలోనే శుభవార్త అందించేలా కనిపిస్తోంది. రాష్ట్రానికి భవిష్యత్తులో కొత్తగా ఆరు ఎయిర్‌పోర్టులు రానున్నట్లు సమాచారం. ఈ మేరకు కేంద్రం ఆదేశాలతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ కొత్తగా ఆరు విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణలో కేవలం వాణిజ్యపరంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం తప్పితే.. వేరే చోట ఎక్కడా కూడా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లేదు. బేగంపేట్‌లో ఒక విమానాశ్రయం ఉన్నా.. అది కమర్షియల్ విమానాలకు అనుమతి లేదు.

దీంతో అందరూ కూడా శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్‌నే ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా ఇరు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావడంతో ఈ ఎయిర్‌పోర్టును 10 సంవత్సరాల పాటు పంచుకోనున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆరు వాణిజ్య విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప, ఓర్వకల్, రాజమండ్రి.. ఇలా ఆరు ఎయిర్‌పోర్టులు ఏపీకి అందుబాటులో ఉండగా.. వీటిల్లో మొదటి మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు.

ఇకపోతే గతేడాది టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను గుర్తించడమే కాకుండా.. ప్రస్తుతం ఉపయోగంలో లేని ఎయిర్ స్ట్రిప్స్ అభివృద్ధి కోసం కూడా ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర విమానయాన శాఖకు పంపించింది. ఇక దీనిపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఏరోనాటికల్ సర్వేను నిర్వహించనుంది. ఇందుకు అవసరమైన అర్హతలు, సాంకేతిక అంశాల విషయంలో ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే నిజామాబాద్‌లోని జకర్ణపల్లి, మహబూబ్‌నగర్‌లోని అడ్డకల్ మండలం, కొత్తగూడెంలోని భద్రాద్రిలలో మూడు కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. వీటితో పాటుగా ప్రస్తుతం వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లిలో ఉన్న ఎయిర్ స్ట్రిప్స్‌‌ను కూడా అభివృద్ధి చేయడం కోసం పరిగణలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. వరంగల్ ఎయిర్ స్ట్రిప్ 706 ఎకరాలు కలిగి ఉండగా.. పెద్దపల్లి 288 ఎకరాలు విస్తీర్ణత కలిగి ఉంది. ఇవన్నింటిని కూడా 1981 నుంచి ఉపయోగించట్లేదు. అయితే 1981కి ముందు మాత్రం ఇక్కడ విమానాశ్రయాల నిర్వహణ జరిగినట్లు సమాచారం.

కాగా  విమానాశ్రయాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్ర విమానయాన శాఖకు పంపించిన సంగతి తెలిసిందే. ఇక ఆ నివేదికను ప్రస్తుతం ఏఏఐకు అప్పగించారు. ఈ నేపథ్యంలో జాతీయ విమానాశ్రయాల సంస్థ ఏరియల్ సర్వేను నిర్వహించనుంది. ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు, రన్‌వేలు, ఏటీసీకి అనుకూలతలు, వాతావరణ అంశాల లాంటివి పరిగణలోకి తీసుకోనున్నారు.

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు