Breaking : ఓంప్రకాశ్ మృతదేహానికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ

ఏపీలో సంచలనం రేపిన మొద్దు శ్రీను మ‌ర్డ‌ర్ కేసు దోషి ఓం ప్రకాశ్ ఇటీవ‌ల‌ మృతి చెందిన విష‌యం తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్....

  • Ram Naramaneni
  • Publish Date - 4:13 pm, Wed, 29 July 20
Breaking : ఓంప్రకాశ్ మృతదేహానికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ

Dead Om Prakash Tested Positive Of Covid-19 : ఏపీలో సంచలనం రేపిన మొద్దు శ్రీను మ‌ర్డ‌ర్ కేసు దోషి ఓం ప్రకాశ్ ఇటీవ‌ల‌ మృతి చెందిన విష‌యం తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓం ప్రకాశ్.. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ మేర‌కు కుటుంబ సభ్యులు జైలు అధికారుల‌కు సమాచారం అందించారు. శనివారం రాత్రి ఓం ప్రకాశ్ కు శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది త‌లెత్తింద‌ని జైలు సూపరింటెండెంట్ రాహుల్ వెల్ల‌డించారు. వెంటనే ఆస్పత్రికి తరలించటంతో… చికిత్స పొందుతూ చనిపోయాడ‌ని చెప్పారు. అయితే ఓంప్రకాశ్ మృతదేహానికి వైద్యులు క‌రోనా టెస్టులు చేయ‌గా… అతనికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందని రాహుల్ తెలిపారు. అతని అంత్యక్రియలు విశాఖలోనే కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం జరపనున్నట్లు వివ‌రించారు.

పరిటాల రవి మ‌ర్డ‌ర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొద్దు శ్రీనును ఓం ప్రకాశ్ జైల్లోనే హత్య చేశాడు. 2008 నవంబరు 9న జైల్లోనే డంబుల్‌తో త‌ల‌పై మోదీ చంపేశాడు . ఈ కేసులో ఆరోప‌ణ‌లు నిజ‌మ‌వ్వ‌డంతో ఓం ప్రకాశ్‌కు అనంతపురం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఐతే కొంతకాలంగా ఆరోగ్యప‌ర‌మైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. కిడ్నీలు స‌రిగా పనిచెయ్య‌క‌పోవ‌డంతో వారంలో మూడు రోజులు డ‌యాల‌సిస్ నిర్వ‌హిస్తున్నారు. తొలుత కిడ్నీ స‌మ‌స్య‌తోనే అత‌డు మ‌ర‌ణించాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ డెడ్ బాడీకి క‌రోనా టెస్ట్ చెయ్య‌గా అనూహ్యంగా పాజిటివ్ అని తేలింది.

 

Read More : తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

Read More : ఆస్తి పన్ను బకాయిదారులకు తెలంగాణ స‌ర్కార్ బంపర్ ఆఫర్..