తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

ఇత‌ర వ్య‌క్తుల‌తో స‌న్నిహిత సంబంధాలు, వారిస్తే ఎదురు తిర‌గ‌డాలు..ప‌దే, ప‌దే గొడ‌వ‌లతో విసిగి వేసారిపోయిన ఆ భ‌ర్త గొంతు కోసి భార్య‌ను హ‌త్య‌చేశాడు.

తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు
Follow us

|

Updated on: Jul 29, 2020 | 8:30 AM

Husband Kills Wife : ఇత‌ర వ్య‌క్తుల‌తో స‌న్నిహిత సంబంధాలు, వారిస్తే ఎదురు తిర‌గ‌డాలు..ప‌దే, ప‌దే గొడ‌వ‌లతో విసిగి వేసారిపోయిన ఆ భ‌ర్త గొంతు కోసి భార్య‌ను హ‌త్య‌చేశాడు. అయితే ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తోన్న పోలీసులకు సంచ‌ల‌న విష‌యాలు తెలిశాయి. స‌ద‌రు మ‌హిళకు గతంలో తొమ్మిడి పెళ్లిళ్లు అయ్యాయ‌ని, తొమ్మిదో భ‌ర్త చేతిలో హత్య‌కు గురైంద‌ని తెలిసింది. పహాడీషరీఫ్‌ ఠాణా ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాల ప్ర‌కారం..ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపల్‌ పరిధి శ్రీరామకాలనీలో ఉంటూ క్యాబ్ తోలుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు. నాగరాజుకు స్థానికంగా ఉండే వరలక్ష్మి(30)తో పరిచయం ఏర్ప‌డింది. ఆమె కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని ఓ పెట్రోల్‌ బంకులో వ‌ర్క్ చేస్తోంది. అప్పటికే ఆమెకు భర్త, కుమారుడు ఉన్నారు. నాగరాజు, వరలక్ష్మి మధ్య పరిచయం కాస్తా.. ప్రేమగా మారడంతో వరలక్ష్మి రెండేళ్ల క్రితం తన భర్తను వదిలేసి నాగరాజును వివాహాం చేసుకుంది. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా, ఆ తర్వాత వరలక్ష్మి కొత్త వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం నాగరాజు కంట‌ప‌డింది. దీంతో గొడవలు మొదలయ్యాయి.

Read More : మహిళా గ్రామ వాలంటీర్​పై వృద్ధుడి అసభ్య ప్రవర్తన..నిర్భయ కేసు న‌మోదు

మూడు రోజుల క్రితం ఈ విష‌యంపై పెద్ద‌ గొడవ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కూడా గొడవ జరిగింది. ఈ స‌మ‌యంలో నాగరాజు ఆగ్రహంతో భార్య గొంతు కోసి హతమార్చాడు. నేరుగా పహాడీషరీఫ్‌ ఠాణాకు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయాడు. అయితే వరలక్ష్మికి నాగరాజు తొమ్మిదో భర్త అని విచార‌ణ‌లో తేలింది. పెళ్లి అనంత‌రం ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం, గొడవలు జరిగి భర్తలతో విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకునేదని ఎస్సై తెలిపారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!