కంటైనర్ లారీ సెల్‌ఫోన్ల చోరీని ఛేదించిన పోలీసులు
సినీపక్కీలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీలో తరలిస్తున్న సెల్‌ఫోన్ల చోరీ కేసును గుంటూరు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.
సినీపక్కీలో చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ లారీలో తరలిస్తున్న సెల్‌ఫోన్ల చోరీ కేసును గుంటూరు పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. చెన్నై నుంచి లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ నుంచి సెల్‌ఫోన్లు గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద భారీ చోరీకి గురయ్యాయి. నడుస్తున్న కంటైనర్ నుండి దొంగతనం చేశారు మహారాష్ట్ర కి చెందిన కుంజరభట్ల గ్యాంగ్. దీంతో కేసు నమోదు చేసిన పోలీసలుు.. ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టి మహారాష్ట్రకు చెందిన కంజర భట్ ముఠా పనిగా తేల్చారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశామని, వారి నుంచి 862 సెల్‌ఫోన్లు, రూ.4.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు.
అలాగే మెదక్ జిల్లా చేగుంటలో మరో చోరీకి సంబంధించిన సొత్తు కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. రూ.2.36 కోట్ల విలువైన 1,826 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరానికి వినియోగించిన లారీ, కారును సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. చోరీలో మొత్తం 11 మంది ముఠా సభ్యులు పాల్గొన్నారని, ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామన్నారు. మరో 9 మంది నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. సీసీ ఫ్యూటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని.. 15 రోజుల్లో కేసు ఛేదించామని ఆయన వివరించారు.