అసెంబ్లీలో ‘‘ఆ‘‘ సౌండ్లు.. ఇర్రిటేట్ అవుతున్న సభ్యులు

ఏపీ అసెంబ్లీలో మొబైల్ ఫోన్లు గందరగోళానికి గురి చేస్తున్నాయట. సీరియస్‌గా చర్చలు.. వాడీవేడీగా వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో ఉన్నట్లుండి మోగుతున్న మొబైల్ ఫోన్లు స్పీకర్‌తోపాటు సభ్యులను అసహనానికి గురి చేస్తున్నాయట. దాంతో ఈ విషయంపై స్పీకర్ ఓ గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఏపీ శాసనసభ్యులు. ఏపీ అసెంబ్లీలో గతంలో మొబైల్ ఫోన్ల సిగ్నళ్ళను నిర్వీర్యపరిచే జామర్లను వినియోగించేవారు. దాంతో ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయకపోయినా, వాటిని సైలెంట్ మోడ్‌లో పెట్టకపోయినా కూడా పెద్దగా ఇబ్బంది వుండేది కాదు. […]

అసెంబ్లీలో ‘‘ఆ‘‘ సౌండ్లు.. ఇర్రిటేట్ అవుతున్న సభ్యులు
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 16, 2019 | 5:46 PM

ఏపీ అసెంబ్లీలో మొబైల్ ఫోన్లు గందరగోళానికి గురి చేస్తున్నాయట. సీరియస్‌గా చర్చలు.. వాడీవేడీగా వాదోపవాదాలు జరుగుతున్న తరుణంలో ఉన్నట్లుండి మోగుతున్న మొబైల్ ఫోన్లు స్పీకర్‌తోపాటు సభ్యులను అసహనానికి గురి చేస్తున్నాయట. దాంతో ఈ విషయంపై స్పీకర్ ఓ గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఏపీ శాసనసభ్యులు.

ఏపీ అసెంబ్లీలో గతంలో మొబైల్ ఫోన్ల సిగ్నళ్ళను నిర్వీర్యపరిచే జామర్లను వినియోగించేవారు. దాంతో ఫోన్లను స్విచ్ఛాఫ్ చేయకపోయినా, వాటిని సైలెంట్ మోడ్‌లో పెట్టకపోయినా కూడా పెద్దగా ఇబ్బంది వుండేది కాదు. కానీ శాసనసభను పేపర్‌లెస్‌గా మార్చాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలందరికీ ట్యాబ్‌లను ఇచ్చిన నేపథ్యంలో వైఫై సౌకర్యం కంపల్సరీ అయ్యింది. దాంతో పాటు జామర్లను తొలగించడంతో మొబైల్ ఫోన్లకు సిగ్నళ్ళు బాగానే వస్తున్నాయి. దాంతో ఎమ్మెల్యేలు తమతో పాటు తెచ్చుకునే మొబైల్ ఫోన్లను సైలెంట్ చేయడం మరచిపోతున్నారు. దాంతో తరచూ సభలో రింగ్ టోన్లు వినిపిస్తున్నాయని, కొన్ని సందర్భాలలో వాటి మోత విసుగుపుట్టిస్తోందని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

ఏపీ అసెంబ్లీ వింటర్ సెషన్ ఈసారి ఆద్యంతం వాడీవేడీగానే కొనసాగింది. మంగళవారంతో సభాకార్యక్రమాలు ముగుస్తున్నాయి. అయితే, తొలి రోజు నుంచి సభ పాలక, ప్రతిపక్షాల నడుమ వాదోపవాదాలతో హీటెక్కుతూనే వుంది. దీన్ని లైవ్‌లో చూస్తున్న కొందరు సభ్యుల అనుచరులు కావాలని తమ ఎమ్మెల్యేలకు కాల్స్ చేస్తున్నారని కొందరు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా సీరియస్ చర్చలైనా, వాదోపవాదాలైనా సడన్‌గా మోగుతున్న మొబైల్ రింగ్ టోన్లతో సభ్యులు డైవర్ట్ అవుతున్నారని తెలుస్తోంది. ట్యాబ్‌లను వాడుకోవాల్సిందే.. అదే సమయంలో ఫోన్ల మోతలను నివారించాల్సిందేనంటున్నారు ఎమ్మెల్యే. మధ్యే మార్గంగా సభాపతి ఓ పరిష్కారాన్ని చూడాలని కోరుతున్నారు. మరి స్పీకర్ వచ్చే సెషన్ నాటికి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.