Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLA Dwarampudi: నారాహి వాహనంపై వచ్చి నాటకాలు.. పవన్ కళ్యాణ్‌పై మరోసారి ద్వారంపూడి పంచ్‌లు

చంద్రబాబు చెప్పాడు కదా అంటూ పవన్ అదే మాట్లాడి కాకినాడ పరువు తీయ్యోద్దంటూ జనసేనాని హితవు చెప్పారు. బెస్ట్ లీవింగ్ సిటీ అని కాకినాడ ను కేంద్రం నాల్గోవ స్ధానంలో గుర్తించింది.. వ్యక్తిగతంగా ఎదైనా ఉంటే ఎన్నికల్లో చూసుకుందాం అంటూ పవన్ కు సవాల్ విసిరారు చంద్రశేఖర్ రెడ్డి. 

MLA Dwarampudi: నారాహి వాహనంపై వచ్చి నాటకాలు.. పవన్ కళ్యాణ్‌పై మరోసారి ద్వారంపూడి పంచ్‌లు
Mla Dwarampudi Vs Pawan Kalyan
Follow us
Surya Kala

|

Updated on: Jun 22, 2023 | 1:16 PM

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసిపీ నేతలు, ప్రతిపక్ష జనసేన పార్టీ నేతల మధ్య నువ్వు ఒక మాట అంటే నేను వంద మాటలు ఉప్పు నిప్పు అన్నచందంగా ఉంది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను చేపట్టారు. అన్నవరం సత్యనారాయణ స్వామి కి పూజలు నిర్వహించిన జనసేనాని ప్రజల మధ్యకు చేరుకున్నారు. కాకినాడ బహిరంగ సభలో స్థానిక సమస్యల గురించి ప్రస్తావిస్తూనే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆరోపణలపై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. వారాహి వాహనం కాదు నారాహి వాహనం ఎక్కి పవన్ ద్వారంపూడి జపం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాలతో పవన్ మాట్లాడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. తనపై లేనిపోని నిందలు టీడీపీ వలనే పవన్ వేస్తున్నాడు.. ఇంకా చెప్పాలంటే కాకినాడకు పవన్ చాల చెడ్డ పేరు తీసుకు వస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ద్వారంపూడి చంద్ర శేఖర్.

పవన్ కు సవాల్

ఇవి కూడా చదవండి

చంద్రబాబు అనే …  ఏదైతే వాగుతుందో పవన్ అదే వాగుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు చంద్ర శేఖర్. అంతేకాదు చంద్రబాబు చెప్పాడు కదా అంటూ పవన్ అదే మాట్లాడి కాకినాడ పరువు తీయ్యోద్దంటూ జనసేనాని హితవు చెప్పారు. బెస్ట్ లీవింగ్ సిటీ అని కాకినాడ ను కేంద్రం నాల్గోవ స్ధానంలో గుర్తించింది.. వ్యక్తిగతంగా ఎదైనా ఉంటే ఎన్నికల్లో చూసుకుందాం అంటూ పవన్ కు సవాల్ విసిరారు చంద్రశేఖర్ రెడ్డి.

తనపై గతంలో టిడిపి డ్రగ్స్ కోసం చేసిన ఆరోపణలపై ప్రజలు తిరగబడ్డారని.. గంజాయి, రైస్ అక్రమ రవాణ అంటూ కాకినాడ పరువు ప్రతిష్ట తీయ్యోద్దని పవన్ కళ్యాణ్ కు సూచించారు. వాస్తవంగా చెప్పాలంటే పవన్ ను అనకుడదు. ఎవరైతే తప్పుడు సమాచారం పవన్ కు ఇస్తున్నారో వారిని అనాలన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్.

తప్పుడు సలహాలు వినకు పవన్ కు హితవు 

తూర్పుగోదావరి జిల్లా రైతులు ఏమైనా అమయాకులా..మా కుటుంబానికి ఒక్కో ధాన్యం బస్తా ఇవ్వడానికి… అయినా తాము గత 20 ఏళ్ళు రైస్ మిల్లులు నడపడం లేదని ఎప్పుడో వాటిని లీజ్ లకు ఇచ్చేశామని చెప్పారు. ఇప్పుడు తమ కుటుంబం కేవలం రైస్ ఎగుమతి మాత్రమే చేస్తోందని తనపై వచ్చిన ఆరోపణలకు క్లారిటీ ఇచ్చేలా స్పందించారు.

కాకినాడ పోర్టు నుండి 55 లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతులు జరుగుతుండగా.. తమ కంపెనీ ఎగుమతి రూ.400 కోట్లు టర్నోవర్ ఉందని వెల్లడించారు. పవన్ నీకు ఎవరు నా గురించి సలహ ఇస్తున్నారో వారిని తన  దగ్గరకు పంపమని లేదా కస్టమ్ కార్యాలయం కు పంపమని జనసేనాని సూచించారు. తమ బియ్యం కాకినాడ పోర్ట్ నుంచి మాత్రమే కాదు చత్తీస్‌గఢ్, బీహర్, తెలంగాణ నుంచి కూడా ఎగుమతులు అవుతున్నాయన్నారు.

పవన్ జ్ఞానం తో మాట్లాడు.

తనను విమర్శించడానికి ఏమీ లేక వ్యక్తిగతంగా పవన్ విమర్శిస్తున్నాడు.. నీలాగే ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించాలని అనే రకం తాను అంటూ హెచ్చరించారు. నారాహి వాహనం ఎక్కినప్పుడు కనీసం లోకల్ నాయకులను పరిచయం లేదు.. పవన్ కళ్యాణ్ ను నమ్ముకున్న నాయకులంతా తొందరలోనే మోసపోతారని జనసేన నేతలకు కార్యకర్తలకు హితవు పలికారు.

ప్యాకేజీ ఇవ్వలేదని బాబుని చెప్పమని సవాల్..

కుల ప్రవస్తవన లేకుండా పవన్ ఏ మీటింగ్ ఉండదు.. నేను పవన్ కు ప్యాకేజ్ ఇవ్వలేదని చంద్రబాబును ఖండించమనండి చూద్దాం అంటూ సవాల్ విసిరారు చంద్ర శేఖర్.. అమరావతి ని కమరావతి అన్నాను తప్పా… నేనెప్పుడు కులాల గురించి మాట్లాడ లేదన్నారు.. అమరావతి భూములు ఒక కులం చేతిలోకి వెళ్ళిపోయాయని అన్న విషయాన్నీ ఈ సందర్భంగా మళ్ళీ గుర్తు చేసుకున్నారు ద్వారంపూడి చంద్ర శేఖర్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..