‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు మంత్రి కేటీఆర్‌ అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ...

‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
Sanjay Kasula

|

Aug 27, 2020 | 8:23 PM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ కీలకపాత్ర పోషిస్తోందని పరిశ్రమలు మంత్రి కేటీఆర్‌ అన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ‘ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ’ పేరుతో భారతీయ పరిశ్రమల సమాఖ్య ఓ భారీ వర్చువల్ సదస్సు, ప్రదర్శనను గురువారం ప్రారంభించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నేటి నుంచి నవంబర్ 24 వరకు 90 రోజుల పాటు ఈ వర్చువల్ ప్రదర్శన జరగనుందని ప్రకటించింది. దీనికి సంబంధించిన సన్నాహక సదస్సు రెండురోజుల పాటు జరగనుండగా.. ఇవాళ్టి ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.

నిర్వాహకుల నుంచి అన్ని వివారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ముందుగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ బిజినెస్ ఎకోసిస్టం, వనరులు, రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతల ప్రదర్శనకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని  అన్నారు.  దీంతో రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో డిజిటలైజేషన్ పరిశ్రమలకు కొత్త అవకాశాలు వచ్చాయి అన్నారు.  ఆ అవకాశాలను తెలంగాణ రాష్ట్రం వేగంగా అందిపుచ్చుకుంటోందని కేటీఆర్ తెలిపారు .

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu