ఫోర్త్ ఎస్టేట్ కాదు.. అది ఎల్లో ఎస్టేట్

అధికారిక వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. పత్రికా విలువలను ఎల్లో మీడియా కాలరాస్తూ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను భయబ్రాంతులకు..

  • Pardhasaradhi Peri
  • Publish Date - 8:16 pm, Thu, 27 August 20
ఫోర్త్ ఎస్టేట్ కాదు.. అది ఎల్లో ఎస్టేట్

అధికారిక వైఎస్ఆర్సీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. పత్రికా విలువలను ఎల్లో మీడియా కాలరాస్తూ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. మూడు రాజధానుల పక్రియపై ఏదోరకంగా విషం చిమ్మే ప్రయత్నాలు ఒక వర్గం మీడియా చేస్తోందని మండిపడ్డారు. ఎల్లో మీడియా ఫోర్త్ ఎస్టేట్ కిందకు రాదన్న ఆయన.. ఎల్లో ఎస్టేట్ కింద వస్తుందని చురకలంటించారు. ఇప్పటికైనా చంద్రబాబు భజన మానుకోవాలని హిత‌వు ప‌లికారు.

పరిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌, సీఆర్‌డీఏ ర‌ద్దు చ‌ట్టాల‌పై సుప్రీంకోర్టు తీర్పును చంద్ర‌బాబు ఎల్లో మీడియా వక్రీకరించి రాస్తోంద‌ని.. త్వరగా కేసు పూర్తి చేయాలన్న సుప్రీం వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తున్నారని మండిప‌డ్డారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైజాగ్‌లో పరిపాలన రాజధాని, కర్నూల్‌లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంట‌ని నిలదీసే ప్రయత్నం చేశారు.