AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరంలో మరింత నిఘా పెరగాలిః కేటీఆర్

భాగ్యనగరాన్ని మరింత సురక్షితం నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు తెలిపారు. సోమవారం డీజీపీ, నగర పోలీసు కమీషనర్లతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిశితంగా చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 10 […]

భాగ్యనగరంలో మరింత నిఘా పెరగాలిః కేటీఆర్
Balaraju Goud
|

Updated on: Oct 05, 2020 | 8:19 PM

Share

భాగ్యనగరాన్ని మరింత సురక్షితం నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ.రామారావు తెలిపారు. సోమవారం డీజీపీ, నగర పోలీసు కమీషనర్లతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిశితంగా చర్చించారు. శాంతిభద్రతల పరిరక్షణకు హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు ఐదు లక్షల 80 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను సూచించారు. దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు కలిగిన నగరం హైదరాబాద్‌ అని, ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో ఉన్న నగరగా ఒక రిపోర్ట్ ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని, ఆ దిశగానే ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో శాంతి భద్రతలు కంట్రోల్ లో ఉన్నాయన్నారు. పోలీస్ శాఖను బలోపేతం చేయడం ద్వారా నగరంలో శాంతి భద్రతలను సాఫీగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోకి విదేశీ పెట్టబడులు పెద్ద ఎత్తున వస్తుండడంతో శాంతిభద్రతలతకు ఎలాంటి విఘాతం కలగకుండా తీసుకోవల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మిస్తున్న నూతన ఫ్లైఓవర్లు, రోడ్లు వంటి చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వీటితోపాటు పార్కులు, చెరువులు, బస్తి దావఖాన, వీధి దీపాల స్తంభాలు, మెట్రో పిల్లర్ల వంటి వాటిని సీసీ కెమెరాల కోసం వినియోగించుకునే అంశాలను పరిశీలించాలన్నారు. నగరంలో ప్రజలు గూమిఃకూడే ప్రతి చోట నిఘా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు మొదలైనచోట్ల సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్ నగరం మరింత సురక్షితంగా ఉంటుందని విశ్వాసాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

దీంతో పాటు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యల పైన భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన కూడా పోలీస్ శాఖ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ తరఫున తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మంత్రి కేటీఆర్ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున నమోదవుతున్న సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ సిబ్బందితో పాటు సైబర్ వారియర్ లను పోలీస్ శాఖ రూపొందించుకోవాలని కేటీఆర్ సూచించారు.