మయన్మార్ దేశానికి భారత్ ‘రెమ్ డెసిమిర్’ సాయం
కరోనా వైరస్ అదుపునకు మయన్మార్ దేశానికి భారత్ మూడు వేల రెమ్ డెసిమిర్ వైల్స్ ను అందజేసింది. ఆర్మీ చీఫ్ నరవాణే, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా సోమవారం మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి ఈ మెడిసిన్ ని..
కరోనా వైరస్ అదుపునకు మయన్మార్ దేశానికి భారత్ మూడు వేల రెమ్ డెసిమిర్ వైల్స్ ను అందజేసింది. ఆర్మీ చీఫ్ నరవాణే, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా సోమవారం మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి ఈ మెడిసిన్ ని అందించారు. వీరిద్దరూ ఆదివారంనాడే మయన్మార్ విజిట్ చేశారు. కరోనా వైరస్ పై పోరు సలిపే ఫ్రెండ్లీ దేశాలకు ఇండియా ఇలా సాయం చేస్తోందని వారన్నారు. ఇందుకు ఆంగ్ సాన్ సూకీ కృతజ్ఞతలు తెలిపారు.