Mehul Choksi: బ్రదర్ సెంటిమెంట్…. డొమినికాలో మెహుల్ చోక్సీ సాయానికి వచ్చిన సోదరుడు చేతన్ చోక్సీ ఏం చేశాడంటే …?
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కేసుపై బుధవారం డొమినికా కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తన సోదరుడిని గట్టెకించేందుకు సాయం కోసం ఆయన తమ్ముడు చేతన్ చోక్సీ ఈ దేశంలో అడుగు పెట్టాడు.
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కేసుపై బుధవారం డొమినికా కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తన సోదరుడిని గట్టెకించేందుకు సాయం కోసం ఆయన తమ్ముడు చేతన్ చోక్సీ ఈ దేశంలో అడుగు పెట్టాడు. చోక్సీ ని ఇండియాకు అప్పగించకుండా చూడాలని, ఆయనను రక్షించాలని కోరుతూ డొమినికా ప్రతిపక్ష నేత లెనాక్స్ లింటన్ ను కలుసుకుని ఆయనకు 2 లక్షల డాలర్ల ముడుపులు (లంచం) ఇచ్చాడని స్థానిక మీడియా పేర్కొంది. తన సోదరుడు ఇక్కడ నిర్బంధంలో ఉన్నాడని తెలియగానే ఆయన హాంకాంగ్ నుంచి ఆగమేఘాల మీద ఇక్కడ వాలాడట. మెహుల్ చోక్సీని ఇండియాకు అప్పగించరాదని ఆంటిగ్వా లోని విపక్షాలతో బాటు డొమినికాలోని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. క్రిమినల్ నిందితులను ‘కిడ్నాప్’ చేయడం, అంతర్జాతీయ సరిహద్దులు దాటించడం ప్రభుత్వాలు చేయదగిన పనులు కావని లెనాక్స్ లింటన్ వాదిస్తున్నారు. కాగా 2019 లో తాము చోక్సీకి జారీ చేసిన షో కాజ్ నోటీసును ఆంటిగ్వా ప్రభుత్వం మళ్ళీ ఆయనకు జారీ చేసింది. ఆంటిగ్వా పొరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ఆ నాటి నోటీసులో పేర్కొంది. దాన్ని మళ్ళీ ఆయనకు పంపుతూ దీనికి నెలరోజుల్లోగా సమాధానమివ్వాలని కోరింది. చేతన్ చోక్సీ మాత్రం తన సోదరుడిని రక్షించుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు..
మరోవైపు..మెహుల్ చోక్సీని ఇండియాకు తీసుకువచ్చేందుకు 8 మంది భారత దర్యాప్తు సంస్థల బృందం డొమినికా కోర్టులో తనవంతు ప్రయత్నాలు ప్రారంభించనుంది. ఆయనను ఇండియాకు అప్పగించాల్సిన ఆవశ్యకతను కోర్టుకు వివరించనుంది. ఈ బృందంలో సీబీఐ, ఈడీ సంస్థలతో బాటు సిఆర్పీఎఫ్ నుంచి కూడా ఇద్దరు సభ్యులు ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Poco M3 Pro: పోకో నుంచి విడుదల కానున్న 5జీ మొబైల్.. అద్భుతమైన ఫీచర్స్.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!
Shocking Video: పొదల్లోని కుందేలుపై డేగ సడన్ అటాక్… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి