AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హుజూర్‌నగర్‌లో హుష్ కాంగ్రెస్.. కారణాలివేనా ?

కంచుకోటలో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం. అలాంటలాంటి ఓటమి కాదు. ఏకంగా పిసిసి అధ్యక్షుడినే గట్టి దెబ్బకొట్టారు హుజూర్‌నగర్ ఓటర్లు. ఒక్క చోటంటే ఒక్క మండలంలోనూ ప్రభావం చూపించలేని పరిస్థితి హస్తం పార్టీది. గెలిచేది మేమే… సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేది తామేనని చెప్పుకున్న కాంగ్రెస్‌ నేతల ప్రచారం ఏ మాత్రం పనిచేయలేదని రుజువు చేసింది హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు… కాంగ్రెస్‌ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి. హుజూర్‌నగర్‌. నిన్నటి వరకు […]

హుజూర్‌నగర్‌లో హుష్ కాంగ్రెస్.. కారణాలివేనా ?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 24, 2019 | 7:59 PM

Share

కంచుకోటలో కాంగ్రెస్‌కు ఘోర పరాభావం. అలాంటలాంటి ఓటమి కాదు. ఏకంగా పిసిసి అధ్యక్షుడినే గట్టి దెబ్బకొట్టారు హుజూర్‌నగర్ ఓటర్లు. ఒక్క చోటంటే ఒక్క మండలంలోనూ ప్రభావం చూపించలేని పరిస్థితి హస్తం పార్టీది. గెలిచేది మేమే… సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేది తామేనని చెప్పుకున్న కాంగ్రెస్‌ నేతల ప్రచారం ఏ మాత్రం పనిచేయలేదని రుజువు చేసింది హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం. కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్లు… కాంగ్రెస్‌ ఓటమికి కారణాలు చాలానే ఉన్నాయి.

హుజూర్‌నగర్‌. నిన్నటి వరకు ఇది కాంగ్రెస్‌ కంచుకోట. ఇప్పుడు గులాబీ అడ్డా. ఉత్తమ్‌ ఇలాఖాలో గులాబీ జెండా ఎగురవేసి సైరా.. సైదిరెడ్డి అనిపించారు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో రెండు లక్షలకు పైగా ఓట్లు పోలైతే… 69 వేల ఓట్లను మాత్రమే సాధించింది కాంగ్రెస్‌. 34.65 శాతంతో రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

గతంలో ఇక్కడ హ్యాట్రిక్‌ కొట్టారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. 2009లో 29 వేల 194 ఓట్ల రికార్డు మెజార్టీని సాధించారు. ఇప్పుడా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టారు సైదిరెడ్డి. ఉప ఎన్నిక ప్రచారానికి ముందు నుంచే నియోజకవర్గంలో హడావిడి మొదలు పెట్టింది కాంగ్రెస్‌. అయినా ప్రయోజనం లేకపోయింది. టి.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పూర్తి స్థాయిలో నియోకజవర్గంలోనే ఉండి వ్యూహాలను పన్నారు. అవన్నీ ఇప్పుడు చిత్తయిపోయాయి. దీనికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

  1. ఏకపక్షంగా అభ్యర్థిని ఖరారు చేయడం… తనకు అచ్చొచ్చిన హుజూర్‌నగర్ నియోజకవర్గం తమ కుటుంబం నుంచి చేజారి పోకుండా ఉత్తమ్ వ్యూహాత్మకంగా తన భార్యకు టిక్కెట్ ఇప్పించుకున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి లాంటి వారు వేరే పేర్లను ప్రస్తావించినా చివరికి తన మాటే నెగ్గించుకుని ఆదిలోనే ఏకపక్ష నిర్ణయంతో చాలా మంది సొంత పార్టీ వారిని దూరం చేసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
  2. పార్టీ నేతల మద్దతు కరువు… హుజూర్‌నగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే టిపిసిసిలో ఉత్తమ్ ఏకపక్ష నిర్ణయాలపై, ఒంటెద్దు పోకడలపై పార్టీలోని సీనియర్లు గుర్రుగా వున్నారు. దానికి తోడు పట్టుబట్టి మరీ తన భార్యకే టిక్కెట్ తెప్పించుకోవడం ద్వారా ఉత్తమ్ మరింత ఒంటరయ్యారు. ఒకరిద్దరు ఎంతో కొంత ప్రచారం చేసినా అదంతా మొక్కుబడిగానే సాగిందన్న కామెంట్లున్నాయి.
  3. మహాకూటమిని కాపాడుకోలేకపోవడం.. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ హవాలోను ఉత్తమ్ కుమార్ గెలిచారు అంటే దానికి కారణం టిడిపి, టిజెఎస్, సిపిఐ పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కోవడం. ఈసారి ఆ పార్టీలను ముందే మచ్చిక చేసుకుని, అదే మహాకూటమి తరపున పోటీ చేసి వుంటే ఫలితం వేరేలా వుండేది. నిజానికి సొంతంగా పోటీ చేసిన టిడిపికి దక్కింది కేవలం 1829 ఓట్లు మాత్రమే కానీ.. అదే టిడిపి కాంగ్రెస్ పార్టీతో కలిసి వుంటే ఫలితం కొంచెమైనా వేరేలా వుండేదన్న విశ్లేషణ వినిపిస్తోంది.

హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. 302 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో ఎక్కడా కాంగ్రెస్‌ ప్రభావం చూపించలేకపోయింది. మొదటి రౌండ్‌ నుంచి ఆ పార్టీ అభ్యర్థి పద్మావతి వెనుకంజలోనే ఉన్నారు. పార్టీకి బలం ఉన్న ప్రాంతాల్లోనూ వెనుకబడిపోవడంతో కాంగ్రెస్‌ శ్రేణులన్నీ డీలాపడిపోయాయి.

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని జనాన్ని ఆకట్టుకోవడంలోనూ, భారీ సభ పెట్టి బలం ఉందని నిరూపించుకోవడంలోనూ వైఫల్యం చెందింది కాంగ్రెస్‌. ఉత్తమ్‌ ఒక్కడే బాధ్యతలు మోయడం, నియోజకవర్గం మొత్తాన్ని సమన్వయం చేయడంలో ఆయన వైఫల్యం చెందారనే వాదనలు జరుగుతున్నాయి. పైగా మిగిలిన పార్టీలు మద్దతు ఇవ్వకపోవడం కాంగ్రెస్‌ను మరింత దెబ్బతీసింది. టీడీపీ పోటీ చేసినా ఉనికి చాటుకోలేకపోయింది. ఇక అంతోఇంతో బలం ఉందనుకున్న సీపీఎం, సీపీఐలు దూరం జరిగాయి. సో.. హుజూర్‌నగర్ ఓటమి కాంగ్రెస్ పార్టీది… మరీ ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ స్వయంకృతాపరాధమే.

Follow Us