AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీమిండియాను ఢీ కొట్టే ఇంగ్లాండ్ టీం ఇదే.. వైభవ్ కంటే డేంజరస్ ఈ 16 ఏళ్లు బుడ్డోడు.. ఎవరంటే?

James Coles England Debut: యువ రక్తం, ముసరుతున్న ఆంగ్లేయుల సవాలును ఎదుర్కొని ఇంగ్లాండ్ పిచ్‌లపై మన కుర్రాళ్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. హ్యారీ బ్రూక్ సేనకు చెక్ పెడుతూ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించి హ్యాట్రిక్ సిరీస్ విజయంతో తిరిగి వస్తుందని కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.

టీమిండియాను ఢీ కొట్టే ఇంగ్లాండ్ టీం ఇదే.. వైభవ్ కంటే డేంజరస్ ఈ 16 ఏళ్లు బుడ్డోడు.. ఎవరంటే?
India Vs England T20i Series
Venkata Chari
|

Updated on: Jun 22, 2026 | 10:55 PM

Share

India vs England T20 Series 2026: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఐదు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే, జులై 1వ తేదీ నుంచి జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సమరానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ అత్యంత పటిష్టమైన 17 మంది సభ్యుల జట్టును అధికారికంగా ప్రకటించింది.

బ్రూక్ సారథ్యంలో యువ రక్తం.. ఆల్‌రౌండర్‌గా ఆ వండర్ కిడ్..!

ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు యాజమాన్యం యువ సంచలనం హ్యారీ బ్రూక్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. అనుభవజ్ఞులతో పాటు ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు కల్పించారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు జేమ్స్ కోల్స్. కేవలం 16 ఏళ్ల వయసులోనే దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేసి సంచలనం సృష్టించిన ఈ సుస్సెక్స్ ఆల్‌రౌండర్‌కు మొదటిసారి అంతర్జాతీయ జట్టులో స్థానం లభించింది. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా, ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్‌తోనూ మ్యాచ్‌లను మలుపు తిప్పగలడు. ఈ జట్టులో జోర్డాన్ కాక్స్, టామ్ బాంటన్, ఫిల్ సాల్ట్‌లకు చోటు దక్కగా.. గాయాల కారణంగా బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్‌లు దూరమయ్యారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: గంభీర్‌కు తలనొప్పిలా మారిన ముగ్గురు.. ప్రపంచకప్ బెర్త్ కోసం ఇలా కర్ఛీఫ్ వేశారేంటి..?

ఇంగ్లాండ్ టి20 పూర్తి జట్టు ఇదే:

హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, విల్ జాక్స్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగనున్న టీమిండియా:

ఇంగ్లాండ్‌ను వారి స్వదేశంలోనే మట్టికరిపించేందుకు భారత క్రికెట్ బోర్డు కూడా ముందే యువ, సీనియర్ ఆటగాళ్లతో కూడిన సమతూకమైన జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఈ పర్యటనలో బాధ్యతలు చేపట్టనున్నారు.

భారత జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, రవి బిష్ణోయ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్.

ఇది కూడా చదవండి: IND vs ENG: ఈ ముగ్గురు ఏం తప్పు చేశారయ్యా.. తోపులా దూసుకెళ్తున్నా, ఛీ కొడుతున్న బీసీసీఐ సెలెక్టర్లు..?

ఐదు టీ20 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):

మొదటి మ్యాచ్: జూలై 1 – రాత్రి 10 గంటలకు (చెస్టర్ లే స్ట్రీట్)

రెండో మ్యాచ్: జూలై 4 – సాయంత్రం 7 గంటలకు (మాంచెస్టర్)

మూడో మ్యాచ్: జూలై 7 – రాత్రి 10 గంటలకు (నాటింగ్‌హామ్)

నాలుగో మ్యాచ్: జూలై 9 – రాత్రి 10 గంటలకు (బ్రిస్టల్)

ఐదో మ్యాచ్: జూలై 11 – సాయంత్రం 7 గంటలకు (సౌతాంప్టన్)

భారత్‌కు సిరీస్ హ్యాట్రిక్ కొట్టే సువర్ణ అవకాశం..!

ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు జరిగిన టీ20 మ్యాచ్‌ల రికార్డులను పరిశీలిస్తే ఇరు జట్ల మధ్య పోరు ఎప్పుడూ హోరాహోరీగానే సాగింది. అక్కడ భారత్ ఆడిన 9 మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ ఐదింటిలో గెలవగా, టీమిండియా 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. సిరీస్‌ల పరంగా చూస్తే ఇరు దేశాలు చెరో రెండు సిరీస్‌లను గెలుచుకున్నాయి. అయితే, గత రెండు టీ20 సిరీస్‌లలోనూ టీమిండియా 2-1 తేడాతో ఇంగ్లాండ్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించి అద్భుత విజయాలను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో, ఈసారి కూడా సిరీస్ కైవసం చేసుకుని ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా మూడోసారి టి20 సిరీస్ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us