Naranipuzha Shanavas Died: చిత్ర పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో డైరెక్టర్ కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకుంది. రచయిత, దర్శకుడు నరన్పుల సన్వాస్(40).. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత విజయ్ బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Naranipuzha Shanavas Died: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకుంది. రచయిత, దర్శకుడు నరన్పుల సన్వాస్(40).. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు, నిర్మాత విజయ్ బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ‘గాంధీరాజన్’ అనే చిత్రం తీస్తున్న సన్వాస్కు గత వారం సెట్లో ఉండగానే గుండెపోటు రావడం వల్ల ఆస్పత్రికి తరలించారు. అనంతరం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న సమయంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత కొంతసేపటికే బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణంపై మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తొలి సినిమా ‘కరీ’తో నరన్పుల మంచి పేరు తెచ్చుకున్నారు. రెండో చిత్రం ‘సూఫియం సుజాతయుం’తో కూడా ప్రేక్షకులను అలరించారు. అదితీరావు హైదరీ నటించిన ఈ సినిమా.. జులైలో అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజైంది.
Also Read :