AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వచ్చే ఏడాదిలో ప్రారంభంకానున్న ‘సలార్’.. కేవలం నాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తికానుందా ?..

బహుబలి సినిమా సూపర్ హిట్ సాధించిన తర్వాత టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‏గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే జోరులో ప్రభాస్ వరుస సినిమాలకు ఓకే చెప్పారు.

వచ్చే ఏడాదిలో ప్రారంభంకానున్న 'సలార్'.. కేవలం నాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తికానుందా ?..
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2020 | 2:48 PM

Share

బహుబలి సినిమా సూపర్ హిట్ సాధించిన తర్వాత టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‏గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే జోరులో ప్రభాస్ వరుస సినిమాలకు ఓకే చెప్పారు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తికావోస్తుంది. అటు రాధేశ్యామ్ మూవీ కాకుండా ప్రభాస్ ఇంకా పలు సినిమాలకు ఓకే చెప్పారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ చేయునున్నాడు ఈ స్టార్ హీరో. అంతేకాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏తో కలిసి సలార్ మూవీ చేయనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రక్రియను జనవరి మూడో వారంలో ప్రారంభించనున్నట్లుగా టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కినస్తున్న కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ పూర్తి కాగానే సలార్ మూవీ చిత్రీకరణ ప్రారంభించనున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ జనవరిలో మొదలు పెట్టి కేవలం నాలుగు నెలల్లో మూవీ చిత్రీకరణ పూర్తిచేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తొంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన వార్తాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఈ సినిమా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని.. అందులో ఒకరు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరీ చూడాలి ఈ నిజంగానే ప్రభాస్ సలార్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.

Follow Us
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
రాసిపెట్టుకోండి.. వన్డే ప్రపంచకప్‌లో సెమీస్ చేరే 4 జట్లు ఇవే..!
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
ఊళ్లో వరుస చావులు.. OTTలో భయపెడుతోన్న హారర్ థ్రిల్లర్
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
16.5 కోట్ల నాటి శిలాజం.. నీటిలో ఈదుతూ వేటాడిన క్షీరదంగా గుర్తింపు
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిజాయితీ ఎందుకు అవసరం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జీవిత పాఠం!
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
నిరుద్యోగితకు అసలైన కొలమానం ఏంటి..? అంకెల వెనుక అసలు నిజాలివే..
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లలను కనండి.!
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
10 రోజుల ఛార్జీతో 30 రోజుల ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
గువహతి ఎయిర్‌పోర్ట్‌ను చూసి ఆశ్చర్యపోయిన రష్యన్‌లు.. వీడియో వైరల్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
బొల్లారం చిన్నారి హత్య కేసు నిందితుడు విక్రమ్ అరెస్ట్
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.
సముద్ర చిలుకకు ప్రాణం పోసిన అధికారులు.