జమ్ముకశ్మీర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్
జమ్ముకశ్మీర్ పై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు నిర్వహించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పుల్వామా ఉగ్రదాడి ఘటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల రాజకీయ నేతలు సరైన రీతిలో వ్యవహరిస్తే ఈ సమస్య ఉండదని అన్నారు. ప్రతిసారి మన సైనికులే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇరు దేశాల […]
జమ్ముకశ్మీర్ పై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు నిర్వహించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పుల్వామా ఉగ్రదాడి ఘటనను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల రాజకీయ నేతలు సరైన రీతిలో వ్యవహరిస్తే ఈ సమస్య ఉండదని అన్నారు. ప్రతిసారి మన సైనికులే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. ఇరు దేశాల రాజకీయ నేతలు సరైన రీతిలో వ్యవహరిస్తే మన సైనికుల ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం ఉండదని.. అప్పుడు నియంత్రణ రేఖ మన ఆధీనంలోనే ఉంటుందని కమల్ హాసన్ అన్నారు.