ఎంపీపీ ముందే తన్నుకున్న మండలాధికారులు

మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు అధికారుల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. డ్యూటీ రిజిస్టర్ లో సంతకం విషయంలో గొడవపడి ఎంపీపీ సమక్షంలోనే ఎంపీడీవో, ఎంఈవోలు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

ఎంపీపీ ముందే తన్నుకున్న మండలాధికారులు
Follow us

|

Updated on: Jul 07, 2020 | 1:19 PM

మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు అధికారుల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. డ్యూటీ రిజిస్టర్ లో సంతకం విషయంలో గొడవపడి ఎంపీపీ సమక్షంలోనే ఎంపీడీవో, ఎంఈవోలు తీవ్రంగా కొట్టుకున్నారు. దీంతో పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

చిన్నచింతకుంట ఎంపీడీవో ఫయాజుద్దీన్‌, ఎంఈవో లక్ష్మణ్‌సింగ్‌ సోమవారం ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి ముందే ఆయన గదిలో ఒకరినొకరు తన్నుకున్నారు. టూర్‌ రిజిస్టర్‌లో ఎంఈవో లక్ష్మణ్‌సింగ్‌ జులై మాసం మొత్తం పర్యటన వివరాలను రాసి సంతకం చేసి వెళ్లారు. మధ్యాహ్నం ఎంపీడీవో దాన్ని పరిశీలించి, అభ్యంతరాలు ఉన్నాయంటూ తన కార్యాలయానికి పిలిపించారు. ఒక రోజు ముందు మాత్రమే పర్యటన వివరాలు రాయాలని, నెల రోజుల టూర్‌ ఎలా రాస్తారని ఎంఈవోను ప్రశ్నించాడు ఎంపీడీవో. తాను చిన్నచింతకుంటతో పాటు కోయిలకొండ ఎంఈవోగా కూడా బాధ్యతలు చేస్తుండటంతో ముందే వివరాలు రాశానని సమాధానం ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాట యుద్ధం రాజుకుంది. అక్కడే ఉన్న ఎంపీపీ ఎదుటే ఒకరిపై ఒకరు దాడి చేసుకొన్నారు. తనను కులం పేరుతో దూషించి దాడి చేశారంటూ ఎంఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు, ఎంపీపీ ఎదుటే ఎంఈవో తనపై దాడి చేశాడని, ఫర్నీచర్ ధ్వంసం చేశాడని ఎంపీడీవో కూడా ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులు స్వీకరంచిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.