సంబరమే సంబరం, పంచాయతీ ఎన్నికల్లో గెలిచాడని భర్తను భుజాలపై మోస్తూ తిరిగిన భార్య, పుణేలో ‘విచిత్రం’

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన భర్త గెలిచినందుకు అతని భార్య సంబరంగా అతడ్ని తన వీపుపై ఎక్కించుకుని గ్రామమంతా తిప్పింది..

  • Umakanth Rao
  • Publish Date - 6:16 pm, Tue, 19 January 21
సంబరమే సంబరం, పంచాయతీ ఎన్నికల్లో గెలిచాడని భర్తను భుజాలపై మోస్తూ తిరిగిన భార్య, పుణేలో 'విచిత్రం'

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన భర్త గెలిచినందుకు అతని భార్య సంబరంగా అతడ్ని తన వీపుపై ఎక్కించుకుని గ్రామమంతా తిప్పింది. పూణే లోని పాలూ గ్రామంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంతోష్ గౌరవ్ అనే వ్యక్తి తన ప్రత్యర్థిపై గెలిచాడు. ఇతనికి 221 ఓట్లు వచ్చాయి. 44 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో అతని భార్య రేణుక ఆనందంతో భర్తను భుజాలపై ఎక్కించుకుని గ్రామంలో తిప్పింది. కోవిద్ పాండమిక్ దృష్ట్యా ఇలాంటి ‘విజయోత్సవాలకు’ 5 గురిని మించి అనుమతించబోమని అధికారులు ముందే హెచ్ఛరించారు. దీంతో రేణుక తమ మద్దతుదారులతో భౌతిక దూరం పాటిస్తూ ఈ విచిత్రమైన ఊరేగింపును నిర్వహించింది. ఈమె భర్త కూడా తన భార్య సంతోషంలో పాలు పంచుకుంటూ చిరునవ్వులు చిందించాడు. మొత్తానికి ఈ భార్యాభర్తల బంధం అందరినీ ఆకర్షించింది.