Fire Breaks out in Hospital: మహారాష్ట్రలో దారుణం.. కోవిడ్ కేర్ హాస్పిటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు సజీవ దహం..
Fire Breaks out in Hospital: మహారాష్ట్రలోని ముంబైలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు కోవిడ్...
Fire Breaks out in Hospital: మహారాష్ట్రలోని ముంబైలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు కోవిడ్ పేషెంట్లు సజీవ దహనం అయ్యారు. పదుల సంఖ్యలో పేషెంట్లు ఆస్పత్రిలో చిక్కుకున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది.. 23 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంపై ముంబై డీసీసీ ప్రశాంత్ కదమ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని భండప్‌లో గల కోవిడ్ కేర్ ఆస్పత్రిలో 76 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మధ్యరాత్రి 12.30 గంటల సమయంలో మాల్ మొదటి అంతస్తులో లెవల్ 3, లెవల్ 4 లో మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించడంతో ఇద్దరు పేషెంట్లు సజీవ దహనం అయ్యారు. 76 మంది పేషెంట్లలో 70 మంది రోగులను రెస్క్యూ చేసి ఇతర ఆస్పత్పికి తరలించామని చెప్పారు. కాగా, ఇంత పెద్ద స్థాయిలో అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని డీసీపీ తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read: