Banks Privatisation: ప్రధాన బ్యాంకుల ప్రైవేటీకరణ.. కేంద్రం విధానాలతో వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..!
Banks Privatisation: వ్యాపారం ప్రభుత్వ బాధ్యత కాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం..
Banks Privatisation: వ్యాపారం ప్రభుత్వ బాధ్యత కాదంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులను కూడా ప్రైవేటుపరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే నాలుగు బ్యాంకుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ల ప్రైవేటీకరించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1 న సమర్పించిన బడ్జెట్‌లో బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు ప్రణాళికలు ఉన్నాయి. ప్రైవేటీకరణ జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ పేరు ప్రస్తావించబడ్డాయి. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
ఇక ఈ నాలుగు బ్యాంకుల్లో రెండు బ్యాంకులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరించనున్నట్లు అధికారిక సమాచారం. బ్యాంకింగ్ రంగంలో, మొదటి దశ ప్రైవేటీకరణలో భాగంగా మిడ్-సైజ్ మరియు చిన్న బ్యాంకులలో వాటాను విక్రయించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో, ప్రభుత్వం దేశంలోని పెద్ద బ్యాంకులపై కూడా తరహాలో చర్యలు తీసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, దేశంలో 5 బ్యాంకులు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటుందని విఎం పోర్ట్‌ఫోలియో రీసెర్చ్ హెడ్ వివేక్ మిట్టల్ టివి 9 హిందీతో చెప్పారు. ఇతర బ్యాంకులు విలీనం చేయబడతాయని, లేదంటే ప్రైవేటీకరించబడతాయని స్పష్టం చేశారు. దేశం మొత్తంలో పెద్ద బ్యాంకులను ప్రభుత్వం విలీనం చేస్తుందని చెబుతున్నారు.
ఇదిలాఉంటే.. బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా బ్యాంకర్లు గత రోజు రెండు రోజుల సమ్మె చేస్తున్నారు. ప్రైవేటీకరణపై బ్యాంకర్లతో పాటు.. వినియోగదారుల్లోనూ విపరీతమైన ఆందోళనలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్‌గా మార్చడం వలన వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. బ్యాంక్ సేవలు మునుపటిలాగే కొనసాగుతాయని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ గురించి ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. ధరలు, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక పునరుద్ధరణ కోసం ఆర్బిఐ అన్ని విధానపరమైన చర్యలను తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.
Also read:
Growing Plants in Space: అంతరిక్షంలో వ్యోమగాముల కోసం వ్యవసాయం.. నాసాతో చేతులు కలిపిన హెచ్‌సీయూ..
CRPF Recruitment 2021: సీఆర్‌పీఎఫ్‌లో ఉద్యోగాలు.. ప్రారంభ జీతం రూ. 85 వేలు.. మీరు అప్లయ్ చేశారా?..