ఊరి కొంపముంచిన మామిడికాయ పచ్చడి..!

వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు. ఆ పచ్చడే ఓ ఊరు మొత్తాన్ని ఇరకాటంలో పెట్టింది. ఆ ఊరి ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ టైమ్‌‌‌‌లో ఊరంతటికీ సాయం చేద్దామనుకుని మామిడికాయ తొక్కు పెట్టించి ఊరంతా పంచాలనుకున్నాడు. అయితే పచ్చడి తయారి చేసిన వ్యక్తులకు కరోనా పాజిటివ్ కావడంతో ఆ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. మాకు కరోనా పరీక్షలు చేయండి బాబూ అంటూ మొర పెట్టుకుంటున్నారు. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి […]

ఊరి కొంపముంచిన మామిడికాయ పచ్చడి..!
Follow us

|

Updated on: May 30, 2020 | 3:10 PM

వేసవికాలం వచ్చిందంటే అవకాయ పచ్చడి పెట్టుకోని తెలుగువారు ఉండరు. ఆ పచ్చడే ఓ ఊరు మొత్తాన్ని ఇరకాటంలో పెట్టింది. ఆ ఊరి ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ టైమ్‌‌‌‌లో ఊరంతటికీ సాయం చేద్దామనుకుని మామిడికాయ తొక్కు పెట్టించి ఊరంతా పంచాలనుకున్నాడు. అయితే పచ్చడి తయారి చేసిన వ్యక్తులకు కరోనా పాజిటివ్ కావడంతో ఆ గ్రామస్తులు లబోదిబోమంటున్నారు. మాకు కరోనా పరీక్షలు చేయండి బాబూ అంటూ మొర పెట్టుకుంటున్నారు. మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కొల్లూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త లాక్​డౌన్ సమయం‌‌లో ఊరంతటికీ ఏదైనా సాయం చేద్దామనుకున్నాడు. కొంత డబ్బు విరాళంగా రావడంతో మామిడి తొక్కు పెట్టి ఊరంతా పంచాలనుకున్నాడు. షాద్‌‌‌‌నగర్‌కి చెందిన తన బంధువైన వ్యాపారిని మే18న ఆశ్రయించాడు. ఊరందరికీ పచ్చడి సఫ్లై చేసేలా ఒప్పందం చేసుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామసభ పెట్టి ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు ప్రజాప్రతినిధి భర్త. మే 20న షాద్‌‌‌‌నగర్ నుంచి మామిడి తొక్కు పెట్టేందుకు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు.. రోజంతా ఉండి 12 మంది సమక్షంలో 2 క్వింటాళ్ల తొక్కు పెట్టారు. అంతా దాన్ని రుచి చూశారు. వారితోనే ఉప్మా వండించుకొని తిన్నారు. వాళ్లు వెళ్లిన తర్వాత తొక్కును ప్యాక్​చేసి ఊరంతా పంచాలనుకున్నారు. కానీ అదే రోజు షాద్‌‌‌‌నగర్‌‌‌‌ వ్యాపారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తొక్కు పెట్టిన ఇద్దరికీ మరుసటి రోజు పాజిటివ్ తేలింది. విషయం తెలిసిన ప్రజాప్రతినిధి భర్తతో పాటు ఊర్లోని అందరికీ భయం మొదలైంది. తొక్కు పెట్టిన వాళ్లకు కరోనా రావడంతో గ్రామస్తులు ఆ తొక్కును డంప్‌‌‌‌ యార్డులో పడేశారు. దీంతో ఊరు ఊరంతా వణికిపోతోంది. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. భయపడి చస్తున్నం.. టెస్టులు చేయండంటూ మొత్తుకుంటోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ ఇద్దరితో ఎక్కువగా కాంటాక్టయిన 12 మందికైనా పరీక్షలు చేయండంటూ ఊరోళ్లు మొర పెట్టుకుంటున్నారు. 4 వేలకు పైగా జనం ఉన్న ఆ ఊర్లో ఇప్పుడు 100 మందికి పైగా హోమ్‌‌‌‌ క్వారంటైన్‌‌‌‌లో ఉన్నారు. ఎవరికి వైరస్ సోకిందో తెలియక అంతా మానసికంగా భయపడిపోతున్నామని, ఇప్పటికైనా టెస్టులు చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు. టెస్ట్ చేయకుంటే ఊరంతా వల్లకాడుగా మారుతోందంటున్నారు.

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!