మధ్యప్రదేశ్ లో ఆ విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం

నీట్, జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బ్లాక్ లేదా జిల్లా ప్రధాన కార్యాలయాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు.

మధ్యప్రదేశ్ లో  ఆ విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 31, 2020 | 11:27 AM

నీట్, జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బ్లాక్ లేదా జిల్లా ప్రధాన కార్యాలయాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇందుకు గాను వారు ఆగస్టు 31 లోగా తమ పేర్లను ప్రభుత్వ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవలసి ఉంటుందని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం ప్రకటించింది. వరదలతో అల్లాడుతున్న ఈ రాష్ట్రంలో స్టూడెంట్స్ కి సర్కార్ ఈ వెసులుబాటు కల్పించడం విశేషం.

ఇటీవల ఛత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నీట్, జేఈఈ పరీక్షలకు హాజరు కాగోరే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్షలు సెప్టెంబరు 13 న, జేఈఈ ఎగ్జామ్స్ సెప్టెంబరు 1-6 మధ్య జరగనున్నాయి.