గిరిజనులతో కలిసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ డ్యాన్స్, చేతిలో విల్లంబులతో సహా ! వీడియో వైరల్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన సహచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. సెహర్ జిల్లా భిలాయ్ గ్రామంలో గిరిజనులకు అటవీ హక్కులకు సంబంధించిన...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన సహచరులతో కలిసి డ్యాన్స్ చేశారు. సెహర్ జిల్లా భిలాయ్ గ్రామంలో గిరిజనులకు అటవీ హక్కులకు సంబంధించిన లీజు సర్టిఫికెట్లను అందజేసిన సందర్భంగా ఆయన వేదికపై చిందులు వేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలతో బాటు ఉత్సాహంగా ఆయన చేతిలో విల్లంబులు పట్టుకుని చేసిన డ్యాన్స్ తాలూకు వీడియో వైరల్ అవుతోంది. జానపద సంగీతం వినిపిస్తుండగా సాంప్రదాయక దుస్తుల్లో కొందరు మహిళలు, పురుషులు కూడా ఆయనతో పదం కలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, 2006 డిసెంబరుకు ముందు అటవీ భూమిని కలిగిఉన్న గిరిజనులకు లీజు సర్టిఫికెట్లను అందజేసినట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఇదివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం..వీరి సంక్షేమానికి చేసిందేమీ లేదని చౌహాన్ ఆరోపించారు. పైగా వారి భూములను కబ్జా చేసిందని, కోర్టు కేసుల్లో వారిని ఇరికించిందని, వారి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుందని ఆయన దుయ్యబట్టారు. ఈ అన్యాయాన్ని తాము సరిదిద్దుతున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రతి గ్రామంలో సాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని, పారిశ్రామిక సంస్థల్లో మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఓ పాలసీని తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ప్రభుత్వం నుంచి తమకు లభించిన ఈ అనూహ్య వరం పట్ల భిలాయ్ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ये बात तो तय है कि दिल्ली-मुंबई से @ChouhanShivraj @OfficeofSSC पब्लिक कनेक्ट को समझा नहीं जा सकता… इनकी ऊर्जा शानदार है ! @JansamparkMP pic.twitter.com/3qQMZeXQ5R
— Anurag Dwary (@Anurag_Dwary) December 20, 2020