Bigg Boss-4: బిగ్‌బాస్-4 ఫైనల్‌ చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్.. కంటెస్టెంట్ల గురించి ఏం చెప్పాడో తెలుసా?

Bigg Boss-4: ఎన్నో రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అదే బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్-4 ఫైనల్.

Bigg Boss-4: బిగ్‌బాస్-4 ఫైనల్‌ చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్.. కంటెస్టెంట్ల గురించి ఏం చెప్పాడో తెలుసా?
Follow us
uppula Raju

| Edited By:

Updated on: Dec 21, 2020 | 8:23 AM

Bigg Boss-4: ఎన్నో రోజులుగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అదే బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్-4 ఫైనల్. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు. ఫైనల్ రోజు చాలామంది సెలబ్రిటీల పేర్లు వినిపించినా చివరకు మెగాస్టార్ రావడంతో బిగ్‌బాస్-4 ఫైనల్‌కు మంచి ఊపొచ్చింది. దీంతో ఆయన కంటెస్టెంట్ల ఒక్కొక్కరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బిగ్‌బాస్ అనేది భావోద్వేగాలతో కూడుకున్న రియాలిటీ షో అని దీని ద్వారా మనం ఇతరులతో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుస్తుందని అన్నారు.

అనంతరం బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్‌ను ఉద్ధేశించి ఏంటి అభిజిత్ నిలుచొని ఉన్నావు.. సోఫాలో రిలాక్స్ కావాలిగా అంటూ హుందాగా మాట్లాడారు. దీంతో అభిజిత్ నోట మాటలు రాలేదు. ఇక అఖిల్ గురించి మాట్లాడుతూ బిగ్‌బాస్ హౌజ్‌లో తను చేసిన అల్లరిని గుర్తుకు చేస్తూ నవ్వులు పూయించారు. మూడో స్థానంలో నిలిచిన సోహైల్‌ని చూసి కథ వేరుగుంటది సొహైల్ అంటూ తన ఊత పదాన్ని గుర్తుచేసి అలరించారు. అంతేకాకుండా ఈ డైలాగ్ తన సినిమాలో వాడుకుంటానని పర్మిషన్ ఇస్తావా అంటూ చమత్కరించారు. అంతేకాకుండా తను చేసే సినిమాలో గెస్ట్ క్యారెక్టర్ చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే షో ప్రారంభంలో నాగార్జున గురించి కూడా ఓ విషయాన్ని ప్రస్తావించారు. ఈ మధ్యే నాగ్ మా 60 ఏళ్ల క్లబ్‌లో చేరాడని గుర్తుచేశారు.