ఆ దేశంలో ప్రయాణం ఉచితం.. పైసా ఖర్చులేకుండా.. రైళ్లల్లో, బస్సుల్లో..!

ఆ దేశం తమ ప్రజలందరికీ ఉచితంగానే ప్రయాణ సేవలను అందిస్తోంది. బస్సు, రైలు.. ఇలా ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ఉచితమే. అంటే, పైసా ఖర్చు లేకుండా ఆ దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇంతకీ అది ఏ దేశం? ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? వివరాల్లోకెళితే.. ఈ కీలక నిర్ణయం తీసుకున్న దేశం.. లక్సెంబర్గ్. ఇప్పుడు అక్కడి ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ ఉచితం. ఈ నిర్ణయాన్ని 2018లోనే తీసుకున్నా.. అన్ని అంశాలను పరిశీలించి అమలు చేయడానికి […]

ఆ దేశంలో ప్రయాణం ఉచితం.. పైసా ఖర్చులేకుండా.. రైళ్లల్లో, బస్సుల్లో..!
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2020 | 5:56 PM

ఆ దేశం తమ ప్రజలందరికీ ఉచితంగానే ప్రయాణ సేవలను అందిస్తోంది. బస్సు, రైలు.. ఇలా ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం ఉచితమే. అంటే, పైసా ఖర్చు లేకుండా ఆ దేశంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఇంతకీ అది ఏ దేశం? ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? వివరాల్లోకెళితే.. ఈ కీలక నిర్ణయం తీసుకున్న దేశం.. లక్సెంబర్గ్. ఇప్పుడు అక్కడి ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ ఉచితం. ఈ నిర్ణయాన్ని 2018లోనే తీసుకున్నా.. అన్ని అంశాలను పరిశీలించి అమలు చేయడానికి ఇంత సమయం పట్టింది.

కాగా.. ఇక ఆ దేశంలో ఏ బస్సు, రైలు ఎక్కినా ఛార్జీలు వసూలు చేయరు. కేవలం లగ్జరీ సదుపాయాలు, నైట్ బస్సు సేవలకు మాత్రమే ఛార్జీలు ఉంటాయి. దీనివల్ల ప్రజలకు రూ.7,939 ఆదా కానుంది. 2018లో నిర్వహించిన సర్వేలో లక్సెంబర్గ్‌లో ఎక్కువ మంది ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. 32 శాతం మంది బస్సుల్లో ప్రయాణిస్తుంటే.. కేవలం 19 శాతం మంది మాత్రమే రైళ్లలో ప్రయాణిస్తున్నారు. పైగా, ఆ దేశంలో ట్రామ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్మాణాలు సాగుతున్నాయి.

మరోవైపు ట్రాఫిక్ జామ్‌లు పెరిగాయి. ప్రజలు భారీ సంఖ్యలో సొంత వాహనాలతో రోడ్ల మీదకు వస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించిన ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉచితం చేస్తున్నట్లు ప్రకటించింది. పైగా.. 2013లో జరిగిన ఎన్నికల్లో అధికారి పార్టీ ప్రకటించిన హామీల్లో కూడా ఇది ఉంది. మరి, ఈ నిర్ణయం సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి.