72 గంటల ముందు ఎంపీలకు కరోనా పరీక్షలు
పార్లమెంట్ సమావేశాలపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన కీలకభేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్యశాఖ , ఐసీఎంఆర్ , ఎయిమ్స్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కరోనా నియంత్రణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
Lok Sabha Speaker Om Birla : పార్లమెంట్ సమావేశాలపై లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా అధ్యక్షతన కీలకభేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్యశాఖ , ఐసీఎంఆర్ , ఎయిమ్స్ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కరోనా నియంత్రణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఎంపీలు పాటించాల్సిన గైడ్‌లైన్స్‌పై ఈ సమావేశంలో చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోందని, లోక్‌సభ సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించినట్లుగా స్పీకర్ ఓంబిర్లా తెలిపారు .
ఎంపీలందరూ విధిగా కరోనా టెస్ట్‌లు చేయించుకోవాలని స్పీకర్ ఓంబిర్లా సూచించారు. పార్లమెంట్ సమావేశాలకు 72 గంటల ముందు ఎంపీలకు కరోనా టెస్ట్‌లు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి అక్డోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశముంది.