నాని, సుధీర్ బాబు ‘వి’ సినిమా సాంగ్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'వి'. నాని 25వ మూవీ గా వస్తోన్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందింది. సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నారు. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం సుధీర్ బాబు...
నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘వి’. నాని 25వ మూవీ గా వస్తోన్న ఈ సినిమా మల్టీ స్టారర్ గా రూపొందింది. సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తున్నారు. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు. శుక్రవారం సుధీర్ బాబు – నివేదా థామస్ పాత్రల మధ్య వచ్చే ఒక లవ్ సాంగ్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఆవిష్కరించింది. ‘వస్తున్నా వచ్చేస్తున్నా..’ అంటూ సాగే ఈ పాట ప్రేమికుల మధ్య శృంగారాన్ని వివరిస్తూ సాగుతుంది. శ్రేయా ఘోషల్ ఆలపించగా అమిత్ త్రివేది స్వరపరిచారు. ఈ పాటకి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందనే లభిస్తోంది.
ఒక క్రైమ్ రైటర్ తో లవ్ లో పడిన ఒక పోలీస్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న తరుణంలో అతని జీవితంలోకి ఒక కిల్లర్ ప్రవేశించడంతో వచ్చే అనూహ్య మార్పులే కీలక కథాంశంగా సినిమా ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఆ మలుపులు ఏంటనేదే చిత్రంలో హైలెట్. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతదేశంతోపాటు మొత్తంగా 200 దేశాల్లో సెప్టెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్ లో రిలీజ్ కానుంది.