AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడారం అమ్మవారి దర్శనానికి రావద్దు..!

కరోనా ప్రభావం ఆడవి తల్లులు సామక్క, సారలమ్మలపై పడింది. కొవిడ్ నిబంధనలతో ఆలయాలకు అననుమతినిచ్చినా భక్తులను అనుమతినిచ్చేదీ లేదంటున్నారు పూజారులు.

మేడారం అమ్మవారి దర్శనానికి రావద్దు..!
Balaraju Goud
|

Updated on: Jun 09, 2020 | 1:40 PM

Share

ప్రపంచాన్ని కుదేపేస్తున్న కరోనా ప్రభావం ఆడవి తల్లులు సామక్క, సారలమ్మలపై పడింది. కొవిడ్ నిబంధనలతో ఆలయాలకు అననుమతినిచ్చినా భక్తులను అనుమతినిచ్చేదీ లేదంటున్నారు పూజారులు. లాక్‌డౌన్‌ సడలింపుతో అడవి పల్లెను ఆగం కానివ్వబోమంటున్నారు మేడారం పూజారులు. భక్తులు సహకరించి జూలై నెలాఖరు వరకు ఎవరూ మేడారం అమ్మవార్ల దర్శనానికి రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృభిస్తుండడంతో పాజిటివ్ ఉన్న భక్తులు వస్తే ఆడవిలో ఉన్న పల్లెలు కొవిడ్ బారినపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భక్తులు ఎవరకు మేడారం రావద్దని కోరుతున్నారు పూజారులు. కరోనా కట్టడి కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నామని పూజలు తెలిపారు.