AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

52 రోజుల క‌రోనా పోరాటంలో.. 11 ఏళ్ల బాలుడి విజయం..

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఐతే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో గ‌ల‌ బయానా పట్టణం గత కొన్ని రోజులుగా కరోనా హాట్ స్పాట్‌గా ఉంది. ఇదే ప్రాంతం ప‌రిధిలోని

52 రోజుల క‌రోనా పోరాటంలో.. 11 ఏళ్ల బాలుడి విజయం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 09, 2020 | 2:05 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఐతే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో గ‌ల‌ బయానా పట్టణం గత కొన్ని రోజులుగా కరోనా హాట్ స్పాట్‌గా ఉంది. ఇదే ప్రాంతం ప‌రిధిలోని క‌సాయీ పాడాకు చెందిన కాసిం అనే 11 ఏళ్ల బాలుడు కరోనా బారిన ప‌డ్డాడు. దీంతో అ బాలుడిని ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో ఉంచారు. 52 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన‌ప్ప‌టికీ, కాసిం కరోనా నుంచి కోలుకోలేదు. 12సార్లు నిర్వ‌హించిన వైద్య‌పరీక్షల్లోనూ కాసింకు పాజిటివ్ రిపోర్టు వ‌చ్చింది. దీంతో వైద్యులు కూడా కలత చెందారు.

కాగా.. చివరికి కరోనాపై 11 ఏళ్ల కాసిం విజయం సాధించాడు. 13వ సారి నిర్వ‌హించిన వైద్య ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగిటివ్ రిపోర్టు వ‌చ్చింది. దీంతో కాసింతో పాటు వైద్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాసిం ఉంటున్న‌ప్రాంతంలో 99 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. దీంతో ఈ ప్రాంతం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. ఆ సమయంలో కాసిం కూడా పాజిటివ్‌గాఉన్నాడు. అతని తల్లిదండ్రులు కూడా పాజిటివ్‌గా తేలిన‌ప్ప‌టికీ, ఆసుప‌త్రిలో చికిత్స పొంది, వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వ‌చ్చారు. 13వ సారి నిర్వ‌హించిన‌ వైద్య ప‌రీక్ష‌ల‌ రిపోర్టులో నెగిటివ్ అని వ‌చ్చింది. దీంతో కాసిం వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నాడు.

కోవిద్-19పై విజయం సాధించి, 52 రోజుల తరువాత.. ఇంటికి చేరుకున్న కాసిం తన తల్లితో ఆనందంగా ఉన్నాడు. అలాగే స్నేహితులతో ఆడుకుంటున్నాడు. కాగా కరోనా బాధితుడైన‌‌ 11 ఏళ్ల కాసిం వైద్యులను ఆశ్చర్యపరిచాడు. ఈ చిన్నారిపై పరిశోధనలు చేయాలని ఆరోగ్య శాఖ యోచిస్తోంది. కాసింకు చేసిన 13వ‌, 14 వ వైద్య ప‌రీక్ష‌ల్లో నెగిటివ్ రిపోర్టు వ‌చ్చిన త‌రువాత ఆ బాలుడిని డిశ్చార్జ్ చేశారు.

Also Read: కరోనా వైరస్ లక్షణాలు లేనివారితో.. సంక్రమణం అరుదు..: ప్రపంచ ఆరోగ్య సంస్థ

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత