లష్కర్‌తో దావూద్ భేటీ.. భారత్‌లో ముంబై తరహా దాడులకు కుట్ర..

లష్కర్‌తో దావూద్ భేటీ.. భారత్‌లో ముంబై తరహా దాడులకు కుట్ర..

ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. ఇదే అదనుగా పాకిస్తాన్ భారత్ పై ముంబై

TV9 Telugu Digital Desk

| Edited By:

May 11, 2020 | 3:28 PM

Mumbai like terror attack: ఓ వైపు కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. ఇదే అదనుగా పాకిస్తాన్ భారత్ పై ముంబై తరహా దాడులకు కుట్ర పన్నుతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. మే 10వ తేదీన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లష్కర్ ఎ తొయిబా ప్రతినిధులతో సమావేశమయ్యాడు.

వివరాల్లోకెళితే.. ఇస్లామాబాద్‌లోని సొంత ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నివాసానికి పక్కనే ఈ ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ బృందం కూడా పాల్గొంది. సముద్ర మార్గం గుండా గుజరాత్‌ లేదా మహారాష్ట్రలోకి ఆయుధాలు పంపేందుకు లష్కర్ ఎ తొయిబా యత్నాలు ప్రారంభించింది. కరోనాపై పోరులో భారత్ తలమునకలై ఉన్న తరుణంలో దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని పాక్ యోచిస్తోంది.

కాగా.. ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నుతోంది. లష్కర్ ఎ తొయిబా అధినేత హఫీజ్ సయీద్ ఆశీస్సులతో ఆ సంస్థ సెకండ్ చీఫ్ అబ్దుల్ రహమాన్ మక్కీ గతవారం దావూద్‌తో భేటీ అయ్యాడు. భారత్‌పై దాడులకు పథకం రచించడంతో పాటు అమలు జరిపే విషయంపై చర్చించాడు. దావూద్ గ్యాంగ్ సహకారంతో భారత్‌లోకి ఆయుధాలు చేరేలా చూడాలని ఐఎస్ఐ, లష్కర్ ఎ తొయిబా కోరాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక భారత్‌లో భారీ దాడులకు అవకాశం లేకుండా పోవడంతో ముంబై తరహా దాడి జరపాలని ఐఎస్ఐ పంతం పట్టింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu