గిరిజన సాంప్రదాయాన శ్రీపార్వతీ మల్లికార్జునస్వామి వార్ల లీలాకళ్యాణోత్సవం, అడవి ఆకులతో ఆభరణాలు, తరలివచ్చిన చెంచులు

శ్రీశైల మహాక్షేత్రంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజూ భ్రమరాంబ..

గిరిజన సాంప్రదాయాన శ్రీపార్వతీ మల్లికార్జునస్వామి వార్ల లీలాకళ్యాణోత్సవం, అడవి ఆకులతో ఆభరణాలు, తరలివచ్చిన చెంచులు
Follow us

|

Updated on: Jan 15, 2021 | 7:13 AM

శ్రీశైల మహాక్షేత్రంలో మకరసంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి రోజూ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం నిర్వహించబడుతోంది. అయితే, మకర సంక్రాంతి రోజున మాత్రం శ్రీ పార్వతి మల్లికార్జున స్వామి వార్ల లీలా కల్యాణోత్సవం జరిపించడం విశేషం. చెంచుల ఆరాధ్యదైవంగా పిలువబడుతున్న మల్లికార్జున స్వామికి, అదేవిధంగా చెంచుల ఇంటి అల్లుడుగా పిలుచుకునే మల్లికార్జునస్వామికి ఈ కళ్యాణోత్సవం సందర్భంగా చెంచు గిరిజనులు నూతన వస్త్రాలు అడవి ఆకులతో అల్లిన ఆభరణాలు స్వామివారికి సమర్పించారు.

ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ఈత ఆకులతో అల్లిన కంకణాలు, బాసికాలు.. స్వామి వారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి వడ్డానం, మెట్టెలు, మెడలో అలంకరించేందుకు ఆకులతో అల్లిన హారాలను అందజేశారు. పూర్తిగా గిరిజన చెంచుల సాంప్రదాయంలో జరిగిన ఈ కళ్యాణోత్సవానికి వివిధ జిల్లాల నుంచి చెంచు భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి, పలువురు ఐ.టి.డి.ఎ సిబ్బంది, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. కళ్యాణోత్సవం అనంతరం అర్చక స్వాములు భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!