‘మా ఉద్యోగులను వదిలేయండి’.. ట్రంప్ కి ట్విటర్ సీఈఓ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి, ట్విటర్ కు మధ్య జరుగుతున్న వార్ కొత్త మలుపు తిరిగింది. ఏకంగా ఈ సామాజిక మాధ్యం సీఈఓ జాక్ డోర్సే రంగంలోకి దిగారు...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి, ట్విటర్ కు మధ్య జరుగుతున్న వార్ కొత్త మలుపు తిరిగింది. ఏకంగా ఈ సామాజిక మాధ్యం సీఈఓ జాక్ డోర్సే రంగంలోకి దిగారు. ట్రంప్ ను ఉద్దేశించి ఆయన.. .. ఇక ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయండి అన్నటుగా ట్వీట్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నికల గురించి జరిగే తప్పుడు, వివాదాస్పద సమాచారాన్ని తాము తెలియజేస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ట్విటర్ ను తాను బాయ్ కాట్ చేస్తానని ట్రంప్ హుంకరించిన మరునాడే జాక్ కూడా తామేమీ తక్కువ తినలేదన్నట్టు దీటుగా సమాధానమిచ్చారు. ఈ వ్యవహారం నుంచి మా ఉద్యోగులను వదిలేయండి అని కోరారు. ఒక కంపెనీగా.. అంటే తనకు సంబంధించినంతవరకు తమ ట్విటర్ చేపట్టే చర్యలకు తాను జవాబుదారీగా ఉండాల్సిందేనని, గ్లోబల్ గా జరిగే ఎన్నికల గురించి సరి కాని, వివాదాస్పదమైన సమాచారాన్ని తాము పాయింట్ ఔట్ చేస్తూనే ఉంటామని జాక్ స్పష్టం చేశారు. మా తప్పులేవైనా ఉంటే అంగీకరిస్తాం అన్నారు.
పరస్పర విరుధ్దమైన స్టేట్ మెంట్లను మేం హైలైట్ చేస్తూనే ఉంటాం.. ఇందువల్ల ప్రజలు తమకు తామే ఏది నిజమో నిర్ణయించుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు. తాము పారదర్శకంగా వ్యవహరిస్తామని, ఇది క్రిటికల్ గా ఉండబట్టే తమ చర్యల వెనుక ఎవరున్నారో కొంతమంది గ్రహించగలుగుతారని జాక్ అన్నారు. ఒక బ్యాలట్ పొందడానికి రిజిస్టర్ అవసరంలేదనే ఆలోచనకు వచ్ఛే లా నిన్నటి ట్వీట్లు కొన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి.. రిజిస్టర్ అయిన ఓటర్లు మాత్రమే బ్యాలట్లను అందుకుంటారు.. కావాలంటే నిన్నటి ట్వీట్ల లింక్ ని అప్ డేట్ చేస్తున్నాను అని అన్నారు. ఓటింగ్ లో మెయిలింగ్ వల్ల ఈ ఏడాది నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ కి అది కారణం కావచ్ఛునని ట్రంప్ నిన్న ట్వీట్ చేశారు. అయితే ఈ వాదాన్ని ట్విటర్ ఖండించింది. అమెరికాలో అప్పుడే…. ఉటా, కొలరాడో, హవాయ్, వాషింగ్టన్, ఓరెగావ్ రాష్ట్రాలు అప్పుడే ఎన్నికలను ప్రాథమికంగా ప్రారంభించాయి. బ్యాలట్ ద్వారా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి.
Fact check: there is someone ultimately accountable for our actions as a company, and that’s me. Please leave our employees out of this. We’ll continue to point out incorrect or disputed information about elections globally. And we will admit to and own any mistakes we make.
— jack (@jack) May 28, 2020