ఆ పావురం నాదే.. రిటర్న్ ఇవ్వండి అంటూ మోదీకి రిక్వెస్ట్..
గత నాలుగైదు రోజుల క్రితం పాక్ నుంచి ఓ పావురం దేశ సరిహద్దుల వద్ద ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ పావురం కాలుకి ఓ రింగ్‌తో పాటుగా.. ఓ కోడ్ కూడా ఉండటంతో.. అది పాక్ పంపిన గూఢాచారి అని అనుకున్నారు. పావురాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పావురాన్ని అక్కడి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ పావురం కాలికి ఉన్న రింగ్‌ను, కోడ్‌ను పోలీసులు గుర్తించి.. దర్యాప్తు చేపట్టారు. ఆ కోడ్ ఏంటి అన్న […]
గత నాలుగైదు రోజుల క్రితం పాక్ నుంచి ఓ పావురం దేశ సరిహద్దుల వద్ద ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఆ పావురం కాలుకి ఓ రింగ్‌తో పాటుగా.. ఓ కోడ్ కూడా ఉండటంతో.. అది పాక్ పంపిన గూఢాచారి అని అనుకున్నారు. పావురాన్ని గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పావురాన్ని అక్కడి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత ఆ పావురం కాలికి ఉన్న రింగ్‌ను, కోడ్‌ను పోలీసులు గుర్తించి.. దర్యాప్తు చేపట్టారు. ఆ కోడ్ ఏంటి అన్న దానిపై ఆరా తీయడం ప్రారంభించారు. ఈ ఘటన కథువా జిల్లాలో చోటుచేసుకుంది. అయితే తాజాగా ఆ పావురం తనదేనంటూ పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా చెప్పుకొచ్చాడు. అతను సరిహద్దుకు సమీపంలోని బగ్గా- షకరఘర్ గ్రామానికి చెందిన వాడిగా తెలుస్తోంది. స్పై పావురంగా పిలుస్తున్న ఆ పావురం నాదేనని.. ఆ రింగ్‌పై ఉన్న నంబర్ తన ఫోన్ నంబర్ అంటూ పేర్కొన్నాడు. ఆ పావురాన్ని తిరిగి తనకు అప్పగించాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని రిక్వెస్ట్ చేస్తున్నాడు.