ఏపీలో కరోనా తీవ్రత..24 గంటల్లోనే మరో..
ఏపీలో వ్యాధి తీవ్రత ఎక్కువుగా ఉన్న కర్నూలుకు చెందిన వ్యక్తి వైరస్ బారిన పడి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 2841 కేసులు నమోదు కాగా 1958 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లోనే 48 మంది..

ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 54 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటలలో 9558 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 54 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా నమోదైన కేసులలో నెల్లూరులో 2, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో చెరొకటీ చొప్పున ఉన్నాయి. ఇవి కాక విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి స్వ రాష్ట్రానికి తిరిగి వచ్చిన వారిలో 239 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో వ్యాధి తీవ్రత ఎక్కువుగా ఉన్న కర్నూలుకు చెందిన రోగి మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 59కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 2841 కేసులు నమోదు కాగా 1958 మంది డిశ్చార్జి అయ్యారు. 24 గంటల్లోనే 48 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 824 మంది చికిత్స పొందుతున్నారు.




