లారెన్స్ సంచలన ప్రకటన..మూడు మతాలకు ఒకే దేవాలయం
రాఘవ లారెన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఆయన స్థాయిని రోజురోజుకు పెంచుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు మానవత్వంలోనూ లారెన్స్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు ఆపరేషన్లు, అనాథలకు శరణాలయాలు, వయసుమళ్లినవారికి ఓల్డేజ్ హోమ్స్ నిర్మిస్తూ సమాాజానికి తనవంతు సేవ చేస్తున్నారు. తాజాగా రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన చేశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకే దగ్గర ప్రార్థనలు చేసుకునేలా ఓ మందిరాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. శ్రీ […]
రాఘవ లారెన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా ఆయన స్థాయిని రోజురోజుకు పెంచుకుంటూ వెళ్తున్నారు. మరోవైపు మానవత్వంలోనూ లారెన్స్ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభిమానులకు ఆపరేషన్లు, అనాథలకు శరణాలయాలు, వయసుమళ్లినవారికి ఓల్డేజ్ హోమ్స్ నిర్మిస్తూ సమాాజానికి తనవంతు సేవ చేస్తున్నారు. తాజాగా రాఘవ లారెన్స్ సంచలన ప్రకటన చేశాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఒకే దగ్గర ప్రార్థనలు చేసుకునేలా ఓ మందిరాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లారెన్స్ ప్రకటనపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఇటీవలే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లకు గృహాలు నిర్మించేందుకు బృహత్తర ప్రణాళిక రూపొందించాడు ఈ నటుడు కమ్ దర్శకుడు. అందుకు కిలాడీ హీరో అక్షయ్ కుమార్ రూ.కోటిన్నర ఆర్థిక సాయం ప్రకటించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే లారెన్స్ ప్రస్తుతం ‘కాంచన’ హిందీ రీమేక్‌ను ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరో, హీరోయిన్లుగా అక్షయ్ కుమార్, కియారా అద్వాణీ నటిస్తున్నారు. ఈ వేసవిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
— Raghava Lawrence (@offl_Lawrence) March 2, 2020
ఇది కూడా చదవండి : బీజేపీ ఎంపీ కారుకు గన్స్ ఎక్కుపెట్టిన పార్లమెంటు సిబ్బంది..