చిక్కుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. సుప్రీం సీరియస్

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చిక్కుల్లో పడ్డారు. 2014 నాటి తన ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించిన ఓ కేసులో ఆయన విచారణను ఎదుర్కోవలసి వస్తోంది.

చిక్కుల్లో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.. సుప్రీం సీరియస్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 03, 2020 | 5:05 PM

మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చిక్కుల్లో పడ్డారు. 2014 నాటి తన ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించిన ఓ కేసులో ఆయన విచారణను ఎదుర్కోవలసి వస్తోంది. ఆయనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను ప్రారంభించాలన్న తన ఇదివరకటి ఉత్తర్వులను సమీక్షించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడమే ఇందుకు కారణం. 2014 లో తాను దాఖలు చేసిన ఎలక్షన్ అఫిడవిట్ లో.. తనపై రెండు క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయన్న విషయాన్ని ఫడ్నవీస్ దాచిపెట్టారట. దీనిపై నాగపూర్ కోర్టు గతంలో ఆయనకు సమన్లు జారీ చేసింది. అయితే వాటిని కొట్టివేయాలని ఆయన కోర్టులో సవాలు చేశారు. 1996, 1998 సంవత్సరాల్లో ఈయనపై ఛీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. కానీ వీటిలో ఏ కేసులోనూ అభియోగాలు నమోదు కాలేదు.

గత ఏడాది నాగపూర్ కు చెందిన ఓ లాయర్ స్థానిక కోర్టులో పిటిషన్ వేస్తూ.. ఫడ్నవీస్ మీద క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని కోరారు. పెండింగులో ఉన్న ఈ రెండు కేసుల గురించి ఆయన ప్రస్తావించకుండా దాచిపెట్టారని సతీష్ అనే ఆ లాయర్ ఆరోపించారు. కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేసింది. కోర్టు ఉత్తర్వులను బాంబే హైకోర్టు సమర్థించింది. కానీ సతీష్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు.. మళ్ళీ ఆయనకు  సమన్లు పంపాలంటూ  నాగపూర్ కోర్టుకు సూచించింది. దీంతో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. కాగా ఈ కేసులు రాజకీయ దురుద్దేశపూరితమైనవని ఫడ్నవీస్ పేర్కొన్నారు.  ఏ విషయాన్నీ తను దాచిపెట్టలేదన్నారు. కానీ  అత్యున్నత న్యాయ స్థానంలో ఆయన వేసిన రివ్యూ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఫలితంగా ఫడ్నవీస్ విచారణను ఎదుర్కోక తప్పదు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..