AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేడి ఉన్నా ఆగని కరోనా.. తేల్చిన డాక్టర్లు! వీటిని తప్పక పాటించండి

ఎక్కువ వేడి ఉంటే.. కరోనా రాదని మనం అనుకున్నాం. కానీ అది ముమ్మాటికీ నిజం కాదని డాక్టర్లు అంటున్నారు. సౌదీ అరేబియా వంటి హీట్ దేశంలోనే కరోనా సోకిందంటే.. ఇండియాలోను కూడా వచ్చే అవకాశం..

వేడి ఉన్నా ఆగని కరోనా.. తేల్చిన డాక్టర్లు! వీటిని తప్పక పాటించండి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 03, 2020 | 5:16 PM

Share

ఎక్కువ వేడి ఉంటే.. కరోనా రాదని మనం అనుకున్నాం. కానీ అది ముమ్మాటికీ నిజం కాదని డాక్టర్లు అంటున్నారు. సౌదీ అరేబియా వంటి హీట్ దేశంలోనే కరోనా సోకిందంటే.. ఇండియాలోను కూడా వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిలో కరోనా ఉంటే.. అది వేరే వాళ్లకు వ్యాప్తి చెందుతుందని అంటున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్.. భారత దేశంలోనూ విజృంభనకు రెడీ అయ్యింది. మొన్నటిదాకా ఇండియాలో కరనా వైరస్ ముగ్గురికే ఉందనీ, వాళ్లు కూడా రికవరీ అవుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ 3 కాస్తా.. 6 అయ్యింది. ఒకరు దేశ రాజధాని ఢిల్లీలో, మరొకరు జైపూర్‌లో ఉండగా.. ఇంకొకరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. దీంతో.. తెలుగు రాష్ట్రాల్లో హైలెర్ట్ చేశారు అధికారులు. అలాగే పలువురు సెలెబ్రెటీస్ కూడా కరోనా గురించి పలు రకాల సూచనలు  చేస్తున్నారు. అయితే కరోనా రాకుండా ఉండేందుకు ఈ క్రింది ముఖ్యమైన పాయింట్లను పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిజంగానే కరోనా బారి నుంచి మనం తప్పించుకోవచ్చు.

పాయింట్ నెంబర్ 1: కరోనా వ్యాధి ఎలా వస్తుందో తెలిస్తే.. అది మనకు రాకుండా జాగ్రత్త పడగలం. అందులో మొదటిది. బయట వస్తువులను తాకరాదు. షాపింగ్ మాల్స్‌లో, బస్సుల్లో, ఆటోల్లో, రైళ్లల్లో, విమానాల్లో.. వస్తువులను మనం తాకకుండా ఉండాలి. ప్రయాణ సమయంలో హ్యాండ్ శానిటైజర్ వాడటం మంచి సూచన.

పాయింట్ నెంబర్ 2: గాలీ ద్వారా కరోనా సోకదు. ఇది గాలి ద్వారా సోకే వైరస్ కాదు. గుంపుగా జనం ఉన్నా.. ఆ గాలిలో కోవిడ్ ఉండదు. కానీ ఆ జనంలో ఎవరికో ఒకరికి కరోనా ఉంటే మాత్రం.. అప్పుడు వచ్చే ప్రమాదం ఉంది. వారు తుమ్మినా, దగ్గినా, తాకినా.. ఎదుట వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగానే మాస్క్‌లను వాడండి.

పాయింట్ నెంబర్ 3: ఇప్పుడు కరోనా ప్రభలుతున్న సమయం కాబట్టి.. బయట దొరికే ఆహారాన్ని తీసుకోకపోవడమే మంచిది.

పాయింట్ నెంబర్ 4: కరోనా వైరస్ ఉన్నవారికి మనం దాదాపు 200 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే మనలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి. శక్తి పెరగాలంటే.. పండ్లు, ఆకు కూరలు, ముఖ్యంగా సీ విటమిన్ ఉన్నవి అయితే మరీ మంచివి.

పాయింట్ నెంబర్ 5: ఎల్లప్పుడూ చేతులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కాస్త జలుబు, దగ్గు, నీరసం, ఆయసం ఉన్నవారికి ఈ వైరస్ వెంటనే సోకుతుంది. కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించడం బెటర్.

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా సోకితే.. నిరుత్సాహ పడకూడదు. మనో ధైర్యంతో.. ఖచ్చితంగా మనం రికవరీ అవుతామని నమ్మకంతో ఉండాలి. ధైర్యం పెరిగే కొద్దీ.. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

Read More: డిగ్రీ విద్యార్థినిపై భర్త అత్యాచారం.. దిశ యాప్‌తో పట్టించిన భార్య

Follow Us
సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి
సినిమా నిర్మాణంలో తడబడుతున్న కార్పొరేట్ సంస్థలు.. కారణాలేంటి
స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌
స్ట్రాటజీ మార్చిన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌
కప్ కోసం రంగంలోకి కేకేఆర్ మెంటలోడు.. బరిలోకి దిగితే ఒక్కొక్కడికి
కప్ కోసం రంగంలోకి కేకేఆర్ మెంటలోడు.. బరిలోకి దిగితే ఒక్కొక్కడికి
ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌
ఒక్క హిట్ అంటూ ఎదురుచూస్తున్న బ్యూటీస్‌
మీ కలలో నంది కనిపించిందా..? ఎలా కనిపిస్తే శుభమో తెలుసుకోండి..!
మీ కలలో నంది కనిపించిందా..? ఎలా కనిపిస్తే శుభమో తెలుసుకోండి..!
ఆయన సెట్‌కు ఏనాడూ రాలేదు.. ఈ రోజు ఇలా: రైటర్‌కు వరలక్ష్మి కౌంటర్
ఆయన సెట్‌కు ఏనాడూ రాలేదు.. ఈ రోజు ఇలా: రైటర్‌కు వరలక్ష్మి కౌంటర్
ఓటీటీల డామినేషన్‌కు అసలు కారణాలు అవేనా
ఓటీటీల డామినేషన్‌కు అసలు కారణాలు అవేనా
పచ్చి రొయ్యలు, దోసకాయ కూర ఇలా వండితే.. ఆపకుండా లాగిస్తూనే ఉంటారు
పచ్చి రొయ్యలు, దోసకాయ కూర ఇలా వండితే.. ఆపకుండా లాగిస్తూనే ఉంటారు
మీరు క్రెడిట్‌ కార్డు విషయంలో ఈ పొరపాటు చేస్తే అరెస్ట్‌ చేస్తారా?
మీరు క్రెడిట్‌ కార్డు విషయంలో ఈ పొరపాటు చేస్తే అరెస్ట్‌ చేస్తారా?
పండుగే పండుగ.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పండుగే పండుగ.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!