AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hockey World Cup 2026: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్

FIH పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 5-3తో ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్ చేయగా, హార్దిక్ సింగ్ మరో గోల్ సాధించాడు. పాకిస్థాన్ తరఫున హన్నన్ షాహిద్ రెండు, సుఫ్యాన్ ఖాన్ ఒక గోల్ చేసినా భారత్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు.

Hockey World Cup 2026: పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
India Pakistan Hockey World Cup
SN Pasha
|

Updated on: Aug 19, 2026 | 8:36 PM

Share

పాక్‌పై భారత్‌ ఘన విజయం.. ప్రపంచకప్‌ తదుపరి రౌండ్‌కు అర్హత

హాకీ ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ అదిరిపోయే విజయం సాధించింది. బుధవారం జరిగిన పూల్‌-D చివరి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారత జట్టు 5-3 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో భారత్‌ టోర్నమెంట్‌లో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్థాన్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌ ప్రారంభం నుంచే భారత్‌ దూకుడుగా ఆడింది. ఐదో నిమిషంలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత 11వ నిమిషంలో అభిషేక్‌ అద్భుతమైన ఫీల్డ్‌ గోల్‌ చేయడంతో భారత్‌ ఆధిక్యం 2-0కు చేరింది.

రెండో క్వార్టర్‌లోనూ భారత దాడులు కొనసాగాయి. 21వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చి తన ఖాతాలో రెండో గోల్‌ నమోదు చేశాడు. అయితే వెంటనే పాకిస్థాన్‌ హన్నన్‌ షాహిద్‌ ద్వారా గోల్‌ సాధించి భారత్‌ ఆధిక్యాన్ని తగ్గించింది. 24వ నిమిషంలో అభిషేక్‌ మరోసారి గోల్‌ చేయడంతో భారత్‌ 4-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే సమయంలో పాకిస్థాన్‌ తరఫున సఫ్యాన్‌ ఖాన్‌ గోల్‌ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్‌ 4-2తో ముందంజలో నిలిచింది.

మూడో క్వార్టర్‌లో భారత ఉపకెప్టెన్‌ హార్దిక్‌ సింగ్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు. దీంతో భారత్‌ ఆధిక్యం 5-2కు పెరిగింది. చివరి క్వార్టర్‌లో పాకిస్థాన్‌ పోరాటం కొనసాగించినప్పటికీ భారత రక్షణను పూర్తిగా ఛేదించలేకపోయింది. 46వ నిమిషంలో హన్నన్‌ షాహిద్‌ మరో గోల్‌ చేసినా.. చివరికి భారత్‌ 5-3తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌, అభిషేక్‌ చెరో రెండు గోల్స్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. హార్దిక్‌ సింగ్‌ కూడా ఒక గోల్‌ సాధించాడు. పాకిస్థాన్‌ తరఫున హన్నన్‌ షాహిద్‌ రెండు, సఫ్యాన్‌ ఖాన్‌ ఒక గోల్‌ చేశారు.ఇంగ్లండ్‌తో 2-4 ఓటమి తర్వాత తదుపరి రౌండ్‌ చేరాలంటే భారత్‌కు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో భారత్‌ పూల్‌-Dలో రెండో స్థానంలో నిలిచి తదుపరి దశకు దూసుకెళ్లింది.

Follow Us
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బాబోయ్ దెయ్యం.. మెట్లు దిగుతున్న యువతిపై ఎటాక్‌! సీసీ కెమెరాలో
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
బిగ్‌బాస్‌ షోతో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా?
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
ఏఐ రంగంలో మెటా, గూగుల్‌కు గట్టి పోటీ ఇస్తున్నది ఇవే
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర