AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MiG-21 Fighter Jets: భారత వాయుసేనలో 60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. MiG-21 యుద్ధ విమానాలను ఏం చేస్తారు?

MiG-21 Fighter Jets: ఒకటి లేదా రెండు విమానాలను భావితరాలకు చూపేందుకు 'హెరిటేజ్ ఫ్లైట్స్' (Heritage Flights) కింద సంరక్షిస్తారు. యుద్ధాల్లో కాకుండా ఎయిర్ షోలు, ప్రత్యేక ప్రదర్శనల కోసం వీటిని ఎగరనిస్తారు. వింటేజ్ విమానాలైన టైగర్ మోత్, డకోటాలను ఐఏఎఫ్ ఎలాగైతే..

MiG-21 Fighter Jets: భారత వాయుసేనలో 60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. MiG-21 యుద్ధ విమానాలను ఏం చేస్తారు?
Mig 21 Fighter Jets
Subhash Goud
|

Updated on: Sep 26, 2026 | 12:56 PM

Share

MiG-21 Fighter Jets: భారత వైమానిక దళానికి (IAF) ఆరు దశాబ్దాల పాటు నమ్మకమైన రక్షణ కవచంగా నిలిచిన ‘మిగ్-21′ (MiG-21) యుద్ధ విమానాలకు తుది వీడ్కోలు పలికి ఏడాది అవుతోంది. తరతరాల భారతీయ ఫైటర్ పైలట్లకు యుద్ధ పాఠాలు నేర్పి, ఎన్నో విజయాల్లో పాలుపంచుకున్న ఈ విమానాలు… కాలక్రమంలో కనుమరుగవుతున్నాయి. అయితే, రిటైర్ అయిన తర్వాత ఈ విమానాలను ఏం చేస్తారు? హాంగర్లలో మూలన పడేస్తారా? లేక ఏమైనా శిక్షణ కోసం ఉపయోగిస్తారా? ఇలాంటి డౌట్స్‌ చాలా మందికి వస్తుంటాయి.’ద లాస్ట్ సెల్యూట్’ వంటి డాక్యుమెంటరీలు, IAF అధికారుల వివరాలను బట్టి ఇలాంటి విమానాలను భవిష్యత్తులో ఏం చేస్తారో తెలుసుకుందాం..

అన్నింటికీ ఒకే ముగింపు ఉండదు

రిటైర్ అయిన ప్రతి మిగ్-21 విమానానికీ ఒకే రకమైన భవిష్యత్తు ఉండదంటున్నారు అధికారులు. 2015 నుంచి 2022 వరకు దాదాపు ఏటా ఒక మిగ్-21 యూనిట్ ను IAF క్రమంగా తొలగిస్తూ వచ్చింది. తయారీ వయసు పైబడినప్పటికీ, అవసరమైతే ఈనాటికీ యుద్ధరంగానికి వెళ్లగల సత్తా వీటికి ఉందని స్క్వాడ్రన్ లీడర్ పార్థ్ విక్రమ్ వంటి పైలట్లు గర్వంగా చెబుతారు. కానీ, ఏ విమానానికైనా రిటైర్మెంట్ తప్పదు.

మ్యూజియాలకు

ఇండియా టుడే నివేదిక ప్రకారం, ఒకటి లేదా రెండు విమానాలను భావితరాలకు చూపేందుకు ‘హెరిటేజ్ ఫ్లైట్స్’ (Heritage Flights) కింద సంరక్షిస్తారు. యుద్ధాల్లో కాకుండా ఎయిర్ షోలు, ప్రత్యేక ప్రదర్శనల కోసం వీటిని ఎగరనిస్తారు. వింటేజ్ విమానాలైన టైగర్ మోత్, డకోటాలను ఐఏఎఫ్ ఎలాగైతే ప్రదర్శిస్తోందో, వీటిని కూడా అలాగే వినియోగిస్తారు. అలాగే మిగతా విమానాలను మ్యూజియంలలో గానీ, లేదా ఆర్మీ కంటోన్మెంట్లు, డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ వద్ద పబ్లిక్ డిస్‌ప్లే కోసం ఉంచుతారు. ముంబై బాంద్రాలోని ‘సీ హారియర్’ లాగా ఈ మిగ్-21లు కూడా స్మారక చిహ్నాలుగా నిలిచిపోతాయి. అలాగే పనికివచ్చే కొన్ని విడిభాగాలను భద్రపరిచి, మిగిలిన వాటిని ఇంజనీరింగ్ కాలేజీలకు శిక్షణ నిమిత్తం ఇచ్చే అవకాశం ఉందని ఓ సీనియర్ ఐఏఎఫ్ అధికారి వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Banks Strike: బ్యాంక్ కస్టమర్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ 28 నుంచి బ్యాంకులు బంద్‌..!

ఈ విమానాలను ఏం చేస్తారు?

అయితే ఈ విమానాలను ఏం చేస్తారనే ప్రశ్న తలెత్తుతుంటుంది. కొన్ని విమానాలను పూర్తిగా స్క్రాప్ (తుక్కు) చేస్తారా? అనే దానిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే చాలా అరుదుగా పాత వేరియంట్లకు చెందిన మిగ్-21 విమానాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. హర్యానాలోని రోహ్‌తక్-ఢిల్లీ హైవే పై ఉన్న ఒక డాబా దగ్గర ఓ పాత మిగ్-21 ఎయిర్‌ఫ్రేమ్ (ఇంజిన్ లేకుండా) ప్రదర్శనకు ఉంచడం విశేషం. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వేలంలో దాన్ని కొనుగోలు చేశారని సమాచారం. అమెరికా వంటి దేశాల్లో రిటైర్డ్ ఫైటర్లను ఔత్సాహికులు కొనుగోలు చేయడం, లేదా ‘బోన్‌యార్డ్’ లలో భద్రపరచడం కామన్ అయినప్పటికీ, భారత్‌లో ప్రైవేట్ యాజమాన్యం కిందకి వెళ్లడం చాలా అరుదు.

1980లు, 90ల నాటికి భారత వైమానిక దళంలోని మొత్తం యుద్ధ విమానాల్లో దాదాపు 60 శాతం మిగ్-21 విమానాలే ఉండేవంటే వాటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఐదు తరాల పైలట్లు ఈ విమానంపైనే శిక్షణ పొందారు. సుమారు 90% పైలట్లు తమ కెరీర్‌లో ఏదో ఒక సమయంలో మిగ్-21ను నడిపినవారే. కానీ, ఈ విమానాలు అందించిన సేవల వెనుక ఎంతో విషాదం కూడా దాగిఉంది. కానీ మిగ్-21 సుదీర్ఘ సేవకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. 2012లో అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మాట్లాడుతూ, ఐఏఎఫ్‌లోకి ప్రవేశపెట్టిన 872 మిగ్-21 విమానాల్లో 482 కూలిపోయాయని, ఈ ఘటనల్లో 170 మందికి పైగా ఫైటర్ పైలట్లు మరణించారని చెప్పారు.

2010 నుంచి ఇప్పటివరకూ ఇలాంటి ఘటనలు 20కి పైగా జరిగాయి. ఒక్క 2021లోనే ఐదు మిగ్-21 బైసన్ విమానాలు ప్రమాదాల్లో కూలిపోగా, ముగ్గురు పైలట్లు మరణించారు. 2023 మేలో రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ సమీపంలో ఒక మిగ్-21 కూలిపోయింది. విమాన శకలాలు ఒక ఇంటిని ఢీకొనడంతో ముగ్గురు పౌరులు మరణించారు. ఆ తర్వాత ఐఏఎఫ్ ఈ విమానాలన్నింటినీ నిలిపివేసింది.

20-25 సంవత్సరాల సేవా కాలం కోసం రూపొందించిన మిగ్-21, 1990వ దశకం మధ్య నాటికి సేవల నుండి విరమించుకుంటుందని భావించారు. అయినప్పటికీ, హెచ్‌ఏఎల్ పలు రకాల వేరియంట్లలో భారతదేశానికి చెందిన 650కి పైగా విమానాలను నిర్మించింది. ఈ యుద్ధ విమానం దాదాపు 63 సంవత్సరాల పాటు సేవలందించింది. తేజస్ కార్యక్రమంలో జరిగిన జాప్యాలు ఐఏఎఫ్‌లో దాని సేవా కాలాన్ని పొడిగించాయి.

ఇది కూడా చదవండి: Bank Strike: బ్యాంకులు సంచలన నిర్ణయం.. కస్టమర్లకు భారీ ఊరట.. ATM ఛార్జీలు రద్దు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us