AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Cricket: ఘనమైన ఫేర్‌వెల్ లేకుండానే రిటైరైన భారత క్రికెట్ లెజెండ్స్ వీరే

Cricket Legends: భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలు అందించినప్పటికీ కొందరు దిగ్గజాలకు అధికారిక వీడ్కోలు మ్యాచ్ దక్కలేదు. వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటి స్టార్లు చివరి మ్యాచ్ లేకుండానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. వారి రిటైర్మెంట్, చివరి మ్యాచ్ వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Indian Cricket: ఘనమైన ఫేర్‌వెల్ లేకుండానే రిటైరైన భారత క్రికెట్ లెజెండ్స్ వీరే
Yuvraj Singh
Rakesh
|

Updated on: Sep 26, 2026 | 11:47 AM

Share

Cricket Legends: భారత క్రికెట్ చరిత్రలో ఎంతోమంది ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనలతో దేశానికి మరచిపోలేని విజయాలను అందించారు. కానీ ఎంతో మంది గొప్ప క్రికెటర్లు తమ సుదీర్ఘ కెరీర్ ముగించే సమయంలో ఎటువంటి అధికారిక ఫేర్‌వెల్ (Farewell) మ్యాచ్‌ను ఆడే అవకాశం పొందలేదు. కొందరు చివరి మ్యాచ్ ఆడిన తర్వాత అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించగా, మరికొందరు జట్టుకు దూరమై చాలాకాలం తర్వాత ఆటకు వీడ్కోలు పలికారు. టెస్ట్ దిగ్గజాలు, వరల్డ్ కప్ హీరోలు, అత్యంత విజయవంతమైన కెప్టెన్ సైతం ఎలాంటి సాంప్రదాయ వీడ్కోలు లేకుండానే అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించారు. అలాంటి ప్రముఖ ఏడుగురు భారతీయ దిగ్గజ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.

వీవీఎస్ లక్ష్మణ్

టెస్ట్ క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత సృజనాత్మక బ్యాటర్‌గా పేరుగాంచిన వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) మొత్తం 134 టెస్టులు, 86 వన్డేలు ఆడి అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే 2012లో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కొద్దిగా ముందు ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు ఆకస్మిక రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో ఆయనకు మైదానంలో వీడ్కోలు పలికే అదృష్టం దక్కలేదు.

హర్భజన్ సింగ్

స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) భారత్ తరఫున టెస్టుల్లో 417 వికెట్లు, వన్డేల్లో 269 వికెట్లు పడగొట్టి ఎన్నో విజయాలు అందించారు. వన్డే మరియు టీ20 ప్రపంచ కప్‌లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న ఆయన, చివరిసారిగా 2016లో యూఏఈతో ఆడి.. ఆ తర్వాత 2021లో అన్ని రకాల క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు.

జహీర్ ఖాన్

భారత పేస్ దళానికి వెన్నెముకగా నిలిచిన జహీర్ ఖాన్ (Zaheer Khan), 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2014లో న్యూజిలాండ్‌పై ఆడి ఆ తర్వాత ఏడాది రిటైర్ అయ్యారు.

ఇర్ఫాన్ పఠాన్

ఇక ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై అజేయంగా 29 పరుగులు చేసి, 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నప్పటికీ ఆయనకూ అధికారిక వీడ్కోలు మ్యాచ్ దక్కలేదు. తొలి టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లోనూ ఇర్ఫాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‎గా నిలిచారు.

శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని

వన్డే ఓపెనర్‌గా అద్భుత రికార్డు కలిగిన శిఖర్ ధావన్ (Shikhar Dhawan) 2024లో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుంచి రిటైరయ్యారు. ఆయన చివరిసారిగా 2022లో బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌ ఆడాడు. ఇక 2011 ప్రపంచ కప్ హీరో, టోర్నమెంట్ విజేతగా నిలిచిన యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2019లో రిటైర్మెంట్ ప్రకటించగా, ఆయన చివరి వన్డే మాత్రం 2017లోనే వెస్టిండీస్‌పై జరిగింది.

చివరిగా భారత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరుగాంచిన ఎంఎస్ ధోని (MS Dhoni) కూడా ఎలాంటి వీడ్కోలు మ్యాచ్ లేకుండానే మైదానాన్ని వీడారు. 2019 ప్రపంచ కప్ సెమీఫైనల్ ఆయన ఆడిన చివరి మ్యాచ్ కాగా.. ఆగస్ట్ 15, 2020న ఒక సాధారణ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆయన రిటైర్మెంట్ ప్రకటించి కోట్లాది అభిమానులను భావోద్వేగానికి గురిచేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
యూట్యూబ్‌లో బంగారం షో.. ఇంటికొచ్చేసరికి అంతా గోవిందా!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రీమియం ఫోన్లు సగం ధరకే!
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
మీ నగరాన్ని నడిపించేది మేయరా? కమిషనరా?
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
అన్నం వండే ముందు బియ్యాన్ని ఎందుకు కడగాలి?సైన్స్ చెప్తున్న నిజాలు
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
కెరీర్ పీక్‌లో ఉండగానే ఊహించని ట్విస్ట్.. కట్ చేస్తే 31 ఏళ్లకే
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
ఆసియా క్రీడల్లో గోల్డ్ గెలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు..
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!
స్కూళ్ల దగ్గర వాటిని అమ్మితే కఠిన చర్యలు..? కేంద్రం హెచ్చరిక!