AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉసిరితో జామ్.. పిల్లలకు బ్రెడ్‌తో తినిపించడానికి ఇదే బెస్ట్

పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ బ్రెడ్, జామ్ తినడానికి చాలా ఇష్టం చూపిస్తారు. అయితే చాలా మంది పీనెట్ బటర్, ఫ్రూట్స్ జామ్ ఎక్కువగా తింటుంటారు. కానీ బయట మార్కెట్‌లో కొనుగోలు చేయకుండా, ఇంటిలోనే ఇలా ఉసిరితో జామ్ తయారు చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందంట. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది.

Samatha J
|

Updated on: Sep 26, 2026 | 12:09 PM

Share
చాలా మంది పిల్లలు బ్రెడ్ జామ్ ఇష్టంగా తింటారు. అయితే వారికి ఆరోగ్యకరమైన, రుచికరమైన రిసిపీని అందించాలి అనుకుంటే, వారికి ఈ జామ్ చాలా బెస్ట్ అని చెప్పాలి. బయట మార్కెట్‌లో లభించే జామ్‌లలో కెమికల్స్ లాంటివి కలిపి తయారు చేస్తుంటారు. అలాంటి వాటిని పిల్లలు తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అందువలన ఇప్పుడు మనం ఇంటిలోనే ఆమ్లాతో జామ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ఉసిరికాయలు అరకేజీ, నీళ్లు రెండు నుంచి మూడు గ్లాస్‌లు, బెల్లం అరకేజీ, ఉప్పు , యాలకుల పొడి వన్ టీస్పూన్, మిరియాల పొడి, కారం, నెయ్యి, నిమ్మరసం.

1 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా, ఉసిరికాయలను తీసుకోవాలి, వాటిని శుభ్రంగా కడగాలి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, దానిపై ఒక జాలి గిన్నెను పెట్టి, కడిగిన ఉసిరికాయలను అందులో ఉంచాలి. మూత పెట్టి సుమారు 10-15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో ఉసిరికాయలను తిప్పుతూ, అన్నీ సమానంగా ఉడికేలా చూసుకోవాలి. అవి మెత్తగా ఉడికాయో లేదో తెలుసుకోవడానికి చాకు లేదా స్పూన్‌తో గుచ్చి చూడాలి.

2 / 5
 ఉడికిన ఉసిరికాయలను స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, వాటిని విత్తనాల నుండి వేరు చేసి గుజ్జును మాత్రమే తీసుకోవాలి.   గుజ్జును మిక్సర్ జార్‌లోకి తీసుకొని దానికి పావు కి కేజీ బెల్లం కలిపి మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ పేస్ట్‌ను పాన్‌లోకి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. దీనికి మరో కప్పు చక్కెరను కలపాలి.

3 / 5
చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత, ఒక పావు టీస్పూన్ ఉప్పు, మంచి ఫ్లేవర్ కోసం అర టీస్పూన్ యాలకుల పొడి, మరో అర టీస్పూన్ మిరియాల పొడిని చేర్చాలి.  ఉసిరికాయలో సహజంగా ఉండే వగరును తగ్గించడానికి రెండు లేదా మూడు టీస్పూన్ల నిమ్మరసం పిండి కలపాలి. నిమ్మరసం జామ్ రుచిని కూడా పెంచుతుంది. కారం కూడా కలుపుకోవచ్చు.

4 / 5
తర్వాత పదార్థాలను బాగా కలిపి, చిన్న మంటపై ఇది బాగా ఉడికి చిక్కబడే వరకు ఉడికించుకోవాలి.దాదాపు 10 నిమిషాల తర్వాత, ఇది కొంచెం దగ్గర పడుతుంది. పాన్ అడుగున అంటుకోకుండా ఉండటానికి ఒక టీస్పూన్ నెయ్యిని కలిపి, మరికాసేపు కలుపుతూ ఉడికించాలి.మరో ఐదు ఆరు నిమిషాలు ఉడికించిన తర్వాత, జామ్ పాన్ నుండి విడిపోవడం జరుగుద్దీ. అప్పుడు జాబ్ చిక్కబడినట్లే. స్టవ్ ఆఫ్ చేసి, జామ్ పూర్తిగా చల్లారిన తర్వాత, ఒక శుభ్రమైన, పొడి గాజు సీసాలో తీసుకుని నిల్వ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆమ్లా జామ్ రెడీ

5 / 5
Follow Us
ఉసిరితో జామ్.. పిల్లలకు బ్రెడ్‌తో తినిపించడానికి ఇదే బెస్ట్
ఉసిరితో జామ్.. పిల్లలకు బ్రెడ్‌తో తినిపించడానికి ఇదే బెస్ట్
వర్షంతో మారిన లెక్కలు.. క్వార్టర్స్‌లో టీమిండియాతో అఫ్ఘాన్ ఢీ

తిరుమల వెళ్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి..

టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గుడ్‌బై! ప్రశాంత్ కిషోర్‌‌కు షాక్..

రూ.6,000 చెల్లింపును రూ.2,000 చొప్పున మూడుసార్లు చేస్తే ఏమవుతుంది

పై నుంచి చూస్తే అచ్చం ఇడ్లీ పిండిలాగే ఉంది.. కానీ లోపల.

ఓటీటీలో వణికించే హారర్ థ్రిల్లర్.. పెళ్లైన ప్రతిసారీ కోడలికి అదే

ధోనీ నుంచి లక్ష్మణ్ వరకు.. వీడ్కోలు మ్యాచ్ దక్కని దిగ్గజాలు వీరే

కిడ్నాపైన నాలుగేళ్ల పాపను రెస్క్యూ చేసిన పోలీసులు..

వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటున్నారా?సైన్స్ ఏం చెబుతోంది