స్ట్రాబెర్రీస్ చేసే మ్యాజిక్ ఇదే.. ఎవరు తింటే ఎక్కువ లాభమూ తెలుసా?

Samatha

19 August 2026

స్ట్రాబెర్రీస్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా వీటిని తినాలి అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

అయితే ప్రతి రోజూ తప్పకుండా స్ట్రాబెర్రీస్ తినాలంట. ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు వీటిని తినడం వలన అత్యధిక ప్రయోజనాలు ఉన్నాయంట.

కాగా, ఇప్పుడు మనం స్ట్రాబెర్రీస్ ఎవరు తినడం మంచిది. వీటిని ఎవరు తినడం వలన ఎక్కువ లాభాలు ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

డయాబెటీస్ సమస్యలతో బాధపడేవారికి స్ట్రాబెర్రీస్ చాలా మంచిది. ఇందులో షుగర్, ఫైబర్ తక్కువగా ఉండటం వలన ఇది షుగర్ కంట్రోల్ ఉండేలా చేస్తుంది.

అంతే కాకుండా గుండె సమస్యలతో బాధపడే వారు కూడా స్ట్రాబెర్రీ తినడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

స్ట్రాబెర్రీస్‌లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వలన అధిక రక్తపోటు తగ్గించి, గుండెకు అనేక విధాలుగా మేలు చేస్తుంది.

అలాగే స్ట్రాబెర్రీస్‌లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. అందువలన వీటిని తినడం వలన త్వరగా బరువు తగ్గవచ్చును.

ఎవరు అయితే మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారో, వారు తమ డైట్‌లో స్ట్రాబెర్రీ చేర్చుకోవడం చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.