Batti comments: స్పీకర్ వ్యవస్థపై భట్టి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క శాసనసభ స్పీకర్ వ్యవస్థపై సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Batti Vikramarka sensational comments on speaker system: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క శాసనసభ స్పీకర్ వ్యవస్థపై సంచలన కామెంట్లు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆదర్శవంతమైన స్పీకర్లు రాజకీయ పార్టీలకు అతీతంగా వ్యవహరించేవారని.. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయిందని భట్టి అభిప్రాయం వ్యక్తం చేశారు.
శాసన వ్యవస్థలో స్పీకర్ (సభాపతి) పాత్ర చాలా కీలకం. 30 ఏళ్ళ క్రితం స్పీకర్ స్థానంలో ఎవరున్నా.. రాష్ట్ర గవర్నర్‌కు లభించినంత గౌరవం వుండేది. కానీ 90వ దశకం నుంచి పరిస్థితి మారిపోయింది. ఈక్రమంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క స్పీకర్ వ్యవస్థపై క్రూషియల్ కామెంట్స్ చేశారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పీకర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు… ప్రస్తుతం శ్రీపాదరావు లాంటి స్పీకర్ అవసరం… కేవలం ప్రభుత్వానికే కాకుండా ప్రతిపక్షాలకు కూడా సమానమైన అవకాశాలు కల్పించిన అసలు సిసలైన గాంధీయ వాది శ్రీపాదరావు… ఇప్పుడు అధికార పార్టీ నాయకులు సూచిస్తేనే… ప్రతిపక్షాల నేతలకు మైక్ ఇస్తున్నారు… ’’ ఇవీ భట్టి విక్రమార్క మంగళవారం చేసిన కామెంట్లు.
తాను స్వయంగా డిప్యూటీ స్పీకర్‌గా పని చేసినప్పటికీ.. స్పీకర్ వ్యవస్థపై భట్టి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారపార్టీ చెప్పుచేతల్లో వుండే స్పీకర్ కాకుండా.. ప్రజాస్వామ్యంలో పాలక, ప్రతిపక్షాలకు సమానంగా సభలో మాట్లాడే అవకాశం ఇచ్చే స్పీకర్ కావాలన్నది భట్టి వ్యక్తపరిచిన అభిమతంగా కనిపిస్తోంది.