జగిత్యాల హనీట్రాప్‌లో కొత్తట్విస్ట్

కాశ్మీర్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు వచ్చింది. మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తిపై.. గతంలో కశ్మీర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్థాపూర్‌

జగిత్యాల హనీట్రాప్‌లో కొత్తట్విస్ట్
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 03, 2020 | 9:37 PM

కాశ్మీర్‌ స్పెషల్‌ పోలీస్‌ బృందం జగిత్యాల జిల్లా మల్లాపూర్‌కు వచ్చింది. మల్లాపూర్ మండలం కుస్తాపూర్‌కు చెందిన రాకేష్ అనే వ్యక్తిపై.. గతంలో కశ్మీర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం కుస్థాపూర్‌ వాసి లింగన్నను జమ్ముకశ్మీర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం కింద అరెస్టయిన వ్యక్తికి లింగన్న డబ్బులు పంపాడని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో ఉంటున్న స్నేహితుడి సూచన మేరకు నగదు పంపినట్లు వివరించారు. రూ.5వేల నగదును గూగుల్‌ పే యాప్‌ ద్వారా రాకేశ్‌ అనే వ్యక్తికి బదిలీ చేసినట్లు సమాచారం.

మరోవైపు టెర్రరిస్టులకు రాకేష్‌ ఆర్థిక సహకారాలు అందించినట్లు ఆరోపణలు రావడంతో కశ్మీర్ పోలీసులు లింగన్నను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనపై రాకేశ్‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అతని బ్యాంక్‌ అకౌంట్లు పరిశీలిస్తున్న క్రమంలో కుస్థాపూర్‌ వాసి లింగన్న అతడికి డబ్బులు జమ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు ఇక్కడికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మల్లాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

అయితే ఈ హనీట్రాప్ లో కొత్తట్విస్ట్ చోటుచేసుకుంది. ఆర్మీలో పని చేస్తున్న రాకేశ్ ఓ అధికారి కాగా దుబాయి లో ఉండే శ్రీనివాస్,, అనిత ముగ్గురూ ఫేస్ బుక్ మిత్రులు… ఆర్మీ అధికారి రాకేశ్ కు డబ్బులు అవసరం కాగా దుబాయ్ లో ఉన్న శ్రీనివాస్ ను అడగటంతో తన బావమరిది సరికెల లింగన్నను డబ్బులు వేయాల్సిందిగా శ్రీనివాస్ కోరాడు. శ్రీనివాస్ చెప్పిన వెంటనే రాకేశ్ గూగుల్ పే అకౌంట్ కు లింగన్న మూడు సార్లు డబ్బులు పంపించాడు. దుబాయ్ లో ఉండే శ్రీనివాస్ ,మల్లాపూర్ మండలం కుస్థాపూర్ కు చెందిన సరికెల లింగన్న స్వయానా బావ బావమరుదులు. ఇందులో లింగన్న పాత్ర ఏమాత్రం లేదని ప్రాథమిక సమాచారం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu