బీజేపీ ఎంపీ కారుకు గన్స్ ఎక్కుపెట్టిన పార్లమెంటు సిబ్బంది..

బీజేపీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ సోంకర్  కారు ప్రమాదవశాత్తు పార్లమెంట్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన బూమ్ అడ్డంకులకు తాకింది. దీంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పార్లమెంటు కాంప్లెక్స్‌లోని గేట్ నెంబర్ 1 వద్ద ఈ ఇన్సిడెంట్ జరిగింది.  దీంతో సెక్యురిటీ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు గేట్ వద్ద వచ్చే మేకుల్లాంటి పరికరాలు బయటకు రావడం వల్ల ఎంపీ కారు టైర్లు దెబ్బతిన్నాయి. భద్రతా పరమైన ఉల్లంఘనలు ఏమైనా జరిగాయేమోనని అనుమానించిన..పార్లమెంట్ సెక్యురిటీ బలగాలు […]

బీజేపీ ఎంపీ కారుకు గన్స్ ఎక్కుపెట్టిన పార్లమెంటు సిబ్బంది..
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 03, 2020 | 9:58 PM

బీజేపీ పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ సోంకర్  కారు ప్రమాదవశాత్తు పార్లమెంట్ కాంప్లెక్స్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేసిన బూమ్ అడ్డంకులకు తాకింది. దీంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. పార్లమెంటు కాంప్లెక్స్‌లోని గేట్ నెంబర్ 1 వద్ద ఈ ఇన్సిడెంట్ జరిగింది.  దీంతో సెక్యురిటీ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు గేట్ వద్ద వచ్చే మేకుల్లాంటి పరికరాలు బయటకు రావడం వల్ల ఎంపీ కారు టైర్లు దెబ్బతిన్నాయి. భద్రతా పరమైన ఉల్లంఘనలు ఏమైనా జరిగాయేమోనని అనుమానించిన..పార్లమెంట్ సెక్యురిటీ బలగాలు వెంటనే అలర్టయి.. ఎంపీ కారు వైపు తుపాకులు ఎక్కు పెట్టాయి. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

వినోద్ కుమార్ సోంకర్ ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబి నుండి బీజేపీ ఎంపీగా ప్రతినిథ్యం వహిస్తున్నారు. అంతేకాదు ఆయన బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చాకు అధ్యకుడుగానూ,  పార్లమెం‌టరీ ఎథిక్స్ కమిటీ ప్రస్తుత చైర్‌పర్సన్ కూడా వ్యవహరిస్తున్నారు.