AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి సర్జా భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్.. ఆందోళన వద్దంటున్న మేఘనారాజ్

కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనారాజ్, వారి రెండు నెలల కుమారుడితో పాటు కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మేఘనా రాజ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం నోట్‌ షేర్‌ చేశారు...

చిరంజీవి సర్జా భార్య, కుమారుడికి కరోనా పాజిటివ్.. ఆందోళన వద్దంటున్న మేఘనారాజ్
Sanjay Kasula
|

Updated on: Dec 09, 2020 | 5:33 AM

Share

Late Chiranjeevi Sarja : కన్నడ దివంగత నటుడు చిరంజీవి సర్జా భార్య మేఘనారాజ్, వారి రెండు నెలల కుమారుడితో పాటు కుటుంబసభ్యులు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని మేఘనా రాజ్‌ స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు.. ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం నోట్‌ షేర్‌ చేశారు.

ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉన్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘‘హలో.. మా అమ్మానాన్న, నాకు, నా కుమారుడికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది… గత కొన్ని వారాలుగా మమ్మల్ని కలిసిన వారు కూడా పరీక్షలు నిర్వహించుకోవాలని కోరుతున్నాం.. ప్రస్తుతం మేం చికిత్స పొందుతున్నాం.. చిరు అభిమానులకు ఓ విజ్ఞప్తి.. జూనియర్‌ చిరు ఆరోగ్యం బాగుంది. నేనెల్లప్పుడూ తనతోనే ఉంటున్నా. దయచేసి ఎవరూ ఆందోళన చెందవద్దు.. మహమ్మారిపై యుద్ధంలో మా కుటుంబం గెలుపొందుతుంది. వైరస్‌ను జయిస్తాం’’ అని మేఘన తన ఇన్‌స్టాగ్రామ్‌లో  పేర్కొన్నారు.

View this post on Instagram

A post shared by Meghana Raj Sarja (@megsraj)

కాగా సౌతిండియా సీనియర్‌ హీరో అర్జున్‌ మేనల్లుడు, కన్నడ నటుడు చిరంజీవి సర్జా(36) జూన్‌ 7న గుండెపోటుతో మృతి చెందిన విషయం విదితమే. ఇక అప్పటికే గర్భవతి అయిన చిరు భార్య మేఘనను ఓదార్చడం ఎవరితరం కాలేదు. అయితే భర్త భౌతికంగా దూరమైనా, తన మనసులో ఎప్పుడూ బతికే ఉంటారంటూ ధైర్యం కూడదీసుకున్న ఆమె, భర్త కటౌట్‌ పక్కన పెట్టుకుని సీమంతం వేడుక నిర్వహించుకున్నారు. అక్టోబరులో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.