యడ్యూరప్పకు కుమారస్వామి సడన్ షాక్!

బెంగళూరు: కర్నాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్పకు సిఎం హెచ్‌డీ కుమార స్వామి ఊహించని షాక్ ఇచ్చారు. జేడీఎస్ ఎమ్మెల్యేతో యడ్యూరప్ప బేరసారాలకు దిగినట్టు వెలుగు చూసిన ఆడియో టేపులపై పూర్తి స్థాయి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వివాదంలోకి తనపేరును కూడా లాగారనీ.. నిజానిజాలు తెలియాలంటే సిట్ ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీ వేదికగా స్పీకర్ రమేశ్ కుమార్ సూచించడంతో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిజాయితీకి, […]

యడ్యూరప్పకు కుమారస్వామి సడన్ షాక్!
బెంగళూరు: కర్నాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్పకు సిఎం హెచ్‌డీ కుమార స్వామి ఊహించని షాక్ ఇచ్చారు. జేడీఎస్ ఎమ్మెల్యేతో యడ్యూరప్ప బేరసారాలకు దిగినట్టు వెలుగు చూసిన ఆడియో టేపులపై పూర్తి స్థాయి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ వివాదంలోకి తనపేరును కూడా లాగారనీ.. నిజానిజాలు తెలియాలంటే సిట్ ఏర్పాటు చేయాలంటూ అసెంబ్లీ వేదికగా స్పీకర్ రమేశ్ కుమార్ సూచించడంతో ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

నిజాయితీకి, హుందాతనానికి మారుపేరైన స్పీకర్ కుమార్‌పై ఈ తరహా ఆరోపణలు చేయడం తగదనీ… ఆయన కార్యాలయాన్ని కాపాడాలని సభ్యులంతా కోరారు. స్పీకర్‌పై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తనను సైతం బాధపెట్టాయనీ.. ఆయన సూచన మేరకు సిట్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామని సీఎం కుమార స్వామి పేర్కొన్నారు. కాగా సిట్ విచారణ కేవలం స్పీకర్ వరకే పరిమితం చేయాలనీ… లేకుంటే ప్రభుత్వం సిట్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఈ విచారణ ఎవరినీ వెంటాడేందుకు కాదనీ.. కేవలం నిజానిజాలను వెలుగులోకి తేవడమే దీని ఉద్ధేశమని సీఎం స్పష్టం చేశారు.

సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ నేతలు తమ ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగుతున్నారంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. జేడీఎస్ ఎమ్మెల్యేతో యడ్యూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పును సైతం సీఎం ఇటీవల మీడియాకు విడుదల చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో తమకు అనుకూలంగా రూలింగ్ ఇచ్చేలా ప్రసన్నం చేసుకునేందుకు యడ్యూరప్ప స్పీకర్‌కు  ఏకంగా రూ.50 కోట్లు ఆఫర్ చేసినట్టు ఆడియోలో రికార్డు అయ్యిందని కూడా సీఎం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Published On - 5:49 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu